షూటింగ్ గ్యాప్‌లో పరీక్షలకు ప్రిపరేషన్‌

గత ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి.

Update: 2025-01-10 04:37 GMT

బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. అమన్ దేవగన్‌తో కలిసి రాషా 'ఆజాద్‌' సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్‌ అనే విషయం తెల్సిందే. అమన్‌, రాషా ఇద్దరికీ ఆజాద్ సినిమా అత్యంత కీలకం.అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో అజయ్ దేవగన్‌ కీలక పాత్రలో నటించాడు. సినిమాను జనవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. గత ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ మేకర్స్ గత ఏడ ఆది తీసుకు రాలేకపోయారు.

ఈ ఏడాది ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటించడంతో పాటు ప్రమోషన్‌లోనూ ఆయన ఫేస్ ఎక్కువగా చూపిస్తున్న కారణంగా సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది. ఆజాద్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రాషా, అమన్‌లకు మంచి పేరు వస్తుంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాషా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు చదువును కొనసాగిస్తూ ఉంది. సాధారణంగా స్టార్‌ కిడ్స్ చదువుపై ఎక్కువ ఆసక్తి చూపించరు. కానీ రాషా మాత్రం మినిమం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల సోషల్‌ మీడియాలో రాషా వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. అందులో షూటింగ్‌ గ్యాప్‌లో రాషా హెయిర్ డ్రెస్‌ చేయించుకుంటూ బోర్డ్‌ పరీక్షకి ప్రిపేర్ అవుతోంది. త్వరలో జరగనున్న బోర్డ్‌ పరీక్షల్లో పాస్ కావడం కోసం ఆమె చదువుతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. సాధారణంగా ముద్దుగుమ్మలు హీరోయిన్‌గా ఆఫర్లు వస్తే చాలు చదువుకు గుడ్‌ బై చెప్పేద్దాం అనుకుంటారు. కానీ కొద్ది మంది హీరోయిన్స్ మాత్రం నటిగా మారిన తర్వాత కూడా చదువును కొనసాగించిన దాఖలాలు ఉన్నాయి. అందులో రాషా ఒకరు అంటూ ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది.

సౌత్‌తో పోల్చితే బాలీవుడ్‌లో హీరోయిన్స్‌ వారసులకు మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్స్‌గా మెప్పించిన వారు వారి పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకు వస్తే ప్రేక్షకులు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఆ వారసులు హీరోయిన్స్‌గా వస్తే డిమాండ్ మరింతగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మాదిరిగానే రవీనా టాండన్ కుమార్తె రాసా తడానీ సైతం ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు దక్కించుకోవడంతో పాటు హీరోయిన్‌గా పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. 'ఆజాద్‌' సినిమా హిట్ అయితే వరుసగా పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా రాషా నటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News