వీడియో: ర‌వీనా టాండ‌న్ కూతురు చ‌లిజ్వ‌రం గ్యారెంటీ

ఇటీవ‌ల త‌న కుమార్తె రాషా త‌డానీని వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌డంలో ర‌వీనా బిజీ ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. ఇప్ప‌టికే రాషా త‌డానీ అంద‌చందాలకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

Update: 2025-01-06 01:30 GMT

90ల‌లో అద్భుత‌మైన డ్యాన్స‌ర్ గా, వేడెక్కించే డ్యాన్స్ మూవ్స్ తో కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేసిన ర‌వీనా టాండ‌న్ ని యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. బాల‌య్య‌బాబు `బంగారు బుల్లోడు` చిత్రంలో ర‌వీనా గ్లామ‌ర‌స్ పాత్ర‌తో మ‌తులు చెడ‌గొట్టింది. చాలా కాలం త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ `బుడ్డా హోగా తేరా బాప్` చిత్రంలో న‌టించింది. ఇటీవ‌ల కేజీఎఫ్ 2 లోను ర‌వీనా న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. బాహుబ‌లి ఫ్రాంఛైజీ స‌హా చాలా ద‌క్షిణాది చిత్రాల‌ను ఉత్త‌రాది బెల్ట్ లో విడుద‌ల చేసి భారీగా ఆర్జిస్తున్న టాండ‌న్ ఫిలిం ఎంపైర్‌లో కీల‌క సూత్ర‌ధారిగా ర‌వీనా గురించి చాలా చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌ల త‌న కుమార్తె రాషా త‌డానీని వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌డంలో ర‌వీనా బిజీ ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. ఇప్ప‌టికే రాషా త‌డానీ అంద‌చందాలకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. రాషాకు సంబంధించిన ప్ర‌తిదీ నేష‌న‌ల్ మీడియాలో చ‌ర్చ‌గా మారుతోంది. ఇప్పుడు స్టార్ కిడ్ డెబ్యూ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అభిషేక్ కపూర్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆజాద్`లో అజ‌య్ దేవ‌గ‌న్ క‌జిన్ అమ‌న్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న రాషా న‌టిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ డ్యాన్స్ ట్రాక్ `ఉయి అమ్మ` విడుద‌లై ఆక‌ట్టుకుంటోంది.

ఈ పార్టీ సాంగ్ లో రాషా త‌డాని కిల్ల‌ర్ మూవ్స్ హృద‌యాల‌ను గెలుచుకుంటున్నాయి. రాషా అంద‌మైన డ్యాన్సింగ్ స్కిల్స్ త‌న త‌ల్లి ర‌వీనా టాండ‌న్ ని గుర్తు చేస్తున్నాయ‌ని అభిమానులు పొగిడేస్తున్నారు. ఆరంగేట్ర‌మే న‌ట‌వార‌సురాలు త‌న‌దైన ముద్ర వేసింది. ముఖ్యంగా త‌న అంద‌మైన న‌డుమును ఊపుతూ రాషా చాలా మాయాజాలం సృష్టించింది. డ్యాన్స్ నంబర్‌లో రాషా తన అద్భుతమైన డ్యాన్స్ కదలికలతో డ్యాన్స్ ఫ్లోర్‌ను మ‌రిగించింది.

`ఉయీ అమ్మ`కు మధుబంతి బాగ్చి స్వరాలు అందించ‌గా, అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. బోస్కో లెస్లీ మార్టిస్ నృత్య దర్శకత్వం వహించారు. ఈ ట్రాక్ సాంప్రదాయ, సమకాలీన శైలులను మిళితం చేసిన ప్ర‌త్యేక గీతం అని చెప్పాలి. ఆజాద్ 17 జనవరి 2025న పెద్ద తెరపైకి వస్తుంది.

Full View
Tags:    

Similar News