పిక్‌టాక్ : శ్రీవల్లి వదిన బర్త్‌డే స్పెషల్
రష్మిక మందన్న పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.;

'పుష్ప 2' సినిమా విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా ఆ వైబ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంటర్నెట్‌లో ఇప్పటికీ పుష్ప సాంగ్స్, సోషల్ మీడియాలో పుష్పకి సంబంధించిన రీల్స్, పాటలు తెగ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2 సినిమాకు సంబంధించిన వసూళ్ల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. పుష్ప 2 సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడంతో మరో ఏడాది పాటు చర్చ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నను ఇప్పటికీ ప్రేక్షకులు శ్రీవల్లి వదిన అని పిలుస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రష్మికను శ్రీవల్లి వదిన అని చాలా గౌరవిస్తున్నారు.

రష్మిక మందన్న పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. హ్యాపీబర్త్‌డే టు అవర్ డియరెస్ట్ శ్రీవల్లి అంటూ ఈ ఫోటోను టీం పుష్ప షేర్ చేశారు. శ్రీవల్లి అన్‌సీన్ పిక్చర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఫోటో ఫ్రేమ్‌ను క్లీన్ చేస్తూ కింద కూర్చుని ఉన్నట్లుగా రష్మికను ఈ స్టిల్‌లో చూడవచ్చు. ఎంతో నేచురల్‌గా, చాలా సింపుల్‌గా, పక్కా గృహిణిగా మెడలో తాళి, నుదుట బొట్టు, కాలికి మెట్టెలు, పట్టీలు ఇలా ప్రతి ఒక్కటి శ్రీవల్లి లుక్‌ను పరిపూర్ణం చేశాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పుష్ప లో శ్రీవల్లి ఇంత చక్కగా ఉండటం వల్లే ప్రేక్షకులు ఆమె పాత్రను కూడా ఆస్వాదించారని కొందరు అంటున్నారు.
మొత్తానికి పుష్ప సినిమా గురించి మరోసారి రష్మిక బర్త్‌డే సందర్భంగా చర్చించుకునే విధంగా ఈ ఫోటో చేసింది అనడంలో సందేహం లేదు. పుష్ప 2 తర్వాత రష్మిక మందన్న మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఛావా సినిమాతో దక్కించుకుంది. విక్కీ కౌశల్ హీరోగా రూపొందిన ఛావా సినిమాలో శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో నటించింది. సినిమాలో కీలకమైన పాత్ర కావడంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో రష్మిక మందన్నకి మంచి గుర్తింపు లభించింది. రికార్డు స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న ఛావా సినిమాతో వరుసగా మూడు విజయాలను రష్మిక దక్కించుకున్న విషయం తెల్సిందే.
ఇదే ఏడాది ఛావా సినిమా తర్వాత సల్మాన్ ఖాన్‌తో నటించిన సికిందర్ సినిమాతోనూ రష్మిక మందన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సికిందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. మొదటి రోజు పాతిక కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న సికిందర్ ఆ తర్వాత ఆమాత్రం కూడా దక్కించుకోలేక పోయింది. లాంగ్ రన్‌లో రూ.100 కోట్ల వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావించారు. కానీ అది కూడా నమోదు అయ్యే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో దూసుకు వచ్చిన రష్మిక మందన్నకి సికిందర్ సినిమా పెద్ద సడెన్ బ్రేక్ మాదిరిగా నిలిచింది అంటూ ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక కుబేరా, గర్ల్ ఫ్రెండ్‌తో పాటు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి మన అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్‌డే శ్రీవల్లి.