700 మందితో నేషనల్‌ క్రష్‌ డాన్స్‌...!

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తోంది.

Update: 2024-09-28 12:30 GMT

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తోంది. హిందీలో ఈమె చేసిన యానిమల్‌ సూపర్‌ హిట్‌ అవ్వడంతో అక్కడ మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అమ్మడు బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో విక్కీ కౌశల్‌ హీరోగా రూపొందుతున్న చావా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం రష్మిక మందన్న ఇతర సినిమాలతో పోల్చితే కాస్త ఎక్కువ టైం స్పెండ్‌ చేయడంతో పాటు, ఎక్కువ కష్టపడుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. చావా సినిమా రష్మిక కెరీర్ లో చాలా స్పెషల్‌ మూవీ అనే టాక్‌ సైతం వినిపిస్తుంది.

తాజాగా చావా సినిమా గురించిన మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. సినిమా కోసం రష్మిక మందన్న పై భారీ బడ్జెట్‌ తో ఒక పాట ను షూట్‌ చేశారట. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఏకంగా 700 మంది డాన్సర్స్‌ తో రష్మిక మందన్న ఆ భారీ సాంగ్‌ ను చేసిందట. రష్మిక అంత మంది తో కలిసి చేసిన డాన్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఆ పాటలో రష్మిక మందన్న మునుపు ఎప్పుడు లేని విధంగా చాలా అందంగా కనిపించడం తో పాటు, చాలా ఎనర్జిటిక్ గా డాన్స్ చేసినట్లు సమాచారం అందుతోంది.

చావా సినిమా లక్ష్మణ్‌ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. విక్కీ కౌశల్ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చావా సినిమా అత్యధిక బడ్జెట్‌ సినిమాగా వార్తలు వస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ దక్కించుకుంటున్న విక్కీ కౌశల్‌ మరో భారీ విజయాన్ని ఈ సినిమాతో దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన్న కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో చావా సినిమాల్లో ఆమె పై ప్రత్యేక పాటను చిత్రీకరించారని, ఆమె ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు సినిమాను ఎంజాయ్ చేయడంతో పాటు, పాటను ఎంజాయ్ చేస్తారు అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న జంటగా నటించిన 'చావా' సినిమా ను డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అదే డిసెంబర్‌ 6న రష్మిక నటిస్తున్న టాలీవుడ్‌ మూవీ పుష్ప 2 సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు సినిమాలు ఒక రోజున రాబోతున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ కి డబుల్‌ ధమాకా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే కొందరు మాత్రం ఒకే వారంలో ఆమె రెండు సినిమాలు రావడం సరైనది కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నేషనల్‌ క్రష్ మరో బాలీవుడ్‌ హిట్ ను సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి. తమిళంలో ఈమె నటిస్తున్న కుబేరా సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

Tags:    

Similar News