ఒళ్లు హూనమైనా రెండు గంటలు ఆ పని తప్పనిసరి!
క్రమం తప్పకుండా రెండు పూటలా జిమ్ చేయడం అలవాటు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హార్డ్ వర్క్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాలోనూ అతడి కష్టం తెరపై కనిపి స్తుంది. అందుకే అంత పెద్ద స్టార్ అయ్యాడు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డులు..రివార్డులు అందుకున్నాడు. అలాగే బన్నీ మంచి ఫిట్ నెస్ ప్రియుడు కూడా. నిత్యం తనని పిట్ గా ఉండేలా చూసుకుంటాడు. క్రమం తప్పకుండా రెండు పూటలా జిమ్ చేయడం అలవాటు. అలాగే ఆహారం విషయంలోనే అంతే జాగ్రత్తలు తీసుకుంటాడు.
అలాగని అతడికి ఆకలేస్తే స్టార్ హోట్ ల్ లోనే తినాలనే మి ఉండదు. పూరి గుడిసెలోనైనా? సమయానికి తనకి కావాల్సిన ఆహారం తీసుకుంటాడు. అది అతడిలో ఉన్న గొప్ప లక్షణం. అతడిలో ఉన్న డౌన్ టూ ఎర్త్ క్వాలిటీ. ఇది అందరికీ తెలిసిందే. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్ర వరకూ షూట్ లో పాల్గొంటే అలసిపోతారు .అలాంటి సమయంలో మళ్లీ జిమ్ చేయడం అన్నది సాధ్యం కాదు. కానీ బన్నీ అలాంటి టైప్ కాదు. ఎంత అలసిపోయినా? సరే సాయంత్రం ఇంటికొచ్చి రెండు గంటల పాటు జిమ్ క్రమం తప్పకుండా చేస్తాడు.
ఇన్ డోర్ షూటింగ్ అయినా..ఔట్ డో ర్ షూటింగ్ అయినా జిమ్ మాత్రం మిస్ అవ్వడుట. `పుష్ప-2` షూటింగ్ సమయంలో సాయంత్ర వరకూ అడవిలో షూటింగ్ చేసినా..ఎంతో కఠినమైన షూటింగ్ జరిగినా...షూటింగ్ లో ఒళ్లు హూనమైపోయినా? హోటల్ కి వచ్చిన వెంటనే జిమ్ కి వెళ్లిపోయేవాడని రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. అతడిలో ఆ రకమైన డెడికేషన్ చూసి ఫిదా అయిపోయానని సంతోషం వ్యక్తం చేసింది.
ఐదేళ్ల పాటు ఒకే హీరోతో కలిసి నటించడం తన కెరీర్ లో ఇదే మొదటిసారని తెలిపింది. పుష్ప మొదటి, రెండు భాగాల్లో బన్నీకి జోడీగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. రెండు సినిమాలు పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా రెండవ భాగమైతే ఇప్పుడెలాంటి దూకుడు చూపిస్తుందో తెలిసిందే.