అలా బన్నీ తప్ప మరెవరూ చేయలేరు : రష్మిక

ముఖ్యంగా జాతర సన్నివేశంలో అల్లు అర్జున్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Update: 2024-12-12 06:09 GMT

పుష్ప సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ 'పుష్ప 2'లో అంతకు మించి అన్నట్లుగా నటించారు. ముఖ్యంగా జాతర సన్నివేశంలో అల్లు అర్జున్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బాబోయ్‌ ఒక నటుడు అదీ స్టార్‌ నటుడు ఒక పాత్ర కోసం ఇంతగా చేస్తాడా, ఇంత కష్టపడుతాడా అంటూ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ రేంజ్‌లో సినిమా గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉన్న నేపథ్యంలో హీరోయిన్‌ రష్మిక మందన్న తాజాగా ఒక ఇంట్వ్యూలో తాను పక్కన ఉండి అల్లు అర్జున్‌ నటన, ఆయన పడే కష్టంను చూశాను అంటూ చెప్పుకొచ్చింది.

ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ... అల్లు అర్జున్‌ గారి నటన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన గొప్ప నటుడు, ఆయన ఒక దమ్మున్న నటుడు. ఒక స్టార్‌ హీరో అయ్యి ఉండి చీర కట్టుకుని నటించేందుకు ఒప్పుకోవడం గొప్ప విషయం. అదీ కాకుండా చీరలో డాన్స్, చీరలోనే ఫైట్స్‌, చీరలోనే ఏకంగా 21 నిమిషాలు ఉండి నటించడం అనేది మామూలు విషయం కాదు. అది కేవలం అల్లు అర్జున్‌ గారికి మాత్రమే సాధ్యం. ఆయన తప్ప మరెవ్వరూ అంతటి సాహసం చేయలేరు అంటూ రష్మిక పేర్కొంది.

రష్మిక మందన్న మాట్లాడుతూ అల్లు అర్జున్‌ నటన గురించి చేసిన వ్యాఖ్యలను ఆయన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉన్నారు. ఆకట్టుకునే ఆయన బాడీ లాంగ్వేజ్‌తో పాటు, ప్రతి సీన్‌లో ఆయన చూపించిన ఇన్వాల్వ్‌మెంట్‌కి మరోసారి జాతీయ అవార్డు రావాల్సిందే అంటూ చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎర్ర చందనం దొంగకు జాతీయ అవార్డు ఏంటో అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయన పాత్రను చూసిన వారు మాత్రం గొప్ప నటుడు అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ముందు ముందు అల్లు అర్జున్ మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసం ఏకంగా రూ.300 కోట్ల పారితోషికం అందుకున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో మరే నటుడు, హీరో ఈ స్థాయిలో పారితోషికం అందుకోలేదు. సినిమా హిట్‌ నేపథ్యంలో ఆయనకు లాభాల్లో వాటాగా మరింత మొత్తం రాబోతుంది. సినిమా లాభాల వాటాను కలుపుకుంటే బన్నీ అందుకున్న మొత్తంను ఇతర హీరోలు అందుకోవడంకు చాలా కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల పాటు పుష్ప 2 కోసం బన్నీ పడ్డ కష్టంకు ప్రతిఫలం దక్కింది.

Tags:    

Similar News