రష్మిక ఆ హీరోకి వీరాభిమాని..!

ఐతే తన ఈ సక్సెస్ ఫుల్ కెరీర్ పట్ల సంతృప్తికరంగా ఉందని అంటుంది రష్మిక. అంతేకాదు తను నటించిన హీరోల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

Update: 2024-12-12 13:30 GMT

నేషనల్ క్రష్ రష్మిక ఫాం చూసి మిగతా హీరోయిన్స్ అంతా షాక్ అవుతున్నారు. మొన్నటిదాకా సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈ అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా హిట్లతో అదరగొట్టేస్తునంది. పుష్ప 2 హిట్ తో కెరీర్ ని మరోసారి ఫుల్ స్వింగ్ చేసుకుంది రష్మిక. సినిమాలో శ్రీవల్లి పాత్రలో ఆమె నటనతో పాటు గ్లామర్ షో కూడా ఇంప్రెస్ చేసింది. ఐతే తన ఈ సక్సెస్ ఫుల్ కెరీర్ పట్ల సంతృప్తికరంగా ఉందని అంటుంది రష్మిక. అంతేకాదు తను నటించిన హీరోల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

తాను నటించిన నటుల గురించి చెబుతూ రణ్ బీర్ తో యాక్ట్ చేయడం చాలా సింపుల్ అని అన్నది. అల్లు అర్జున్ చాలా క్లవర్ అని పుష్ప 2 లో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం లక్కీ అని అన్నది. చీరలో అల్లు అర్జున్ డ్యాన్స్ చేయడం అద్భుతమని అన్నది. ఇక సల్మాన్ సెట్ లో ఎంతో సరదాగా ఉంటారు. ఆయన చాలా జోక్స్ వేస్తుంటారని అన్నది రష్మిక. విక్కీ కౌశాల్ ని చూస్తూ యాక్టింగ్ గురించి చాలా నేర్చుకోవచ్చని అన్నది.

ఇక విజయ్ దేవరకొండ గురించి చెబుతూ అతనికి నేను వీరాభిమానిని.. నా కెరీర్ కు అతను సపోర్ట్ గా ఉన్నాడు. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ లో విజయ్ వాయిస్ ఓవర్ సర్ ప్రైజ్ అని అన్నది రష్మిక. ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఈ ప్రేమను మరింత పొందేందుకు ఇంకా ఎక్కువ కష్టపడతానని అంటుంది రష్మిక. ప్రస్తుతం ధనుష్ తో కుబేర, దిల్ గర్ల్ ఫ్రెండ్, సల్మాన్ ఖాన్ సికందర్ సినిమాల్లో నటిస్తుంది రష్మిక.

ఈ సినిమాల్లో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఒక్కటే ఆమె సోలో లీడ్ గా నటిస్తుంది. కుబేర, సికందర్ సినిమాలు మంచి కమర్షియల్ సినిమాలుగా రానున్నాయి. కచ్చితంగా ఈ సినిమాలతో కూడా రష్మిక తన కెపాసిటీ ఏంటన్నది ప్రూవ్ చేసుకుంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ కొనసాగిస్తున్న రష్మిక వరుస సినిమాలు చేస్తూ ఇదే ఫాం మరో ఐదేళ్లు కనబరచేలా ఉంది. తను చేస్తున్న హార్డ్ వర్క్ తో పాటు కాస్త లక్కు కూడా తోడవుతూ అమ్మడికి ఇలా చేస్తున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. అందుకే రష్మిక గురించి నేషనల్ వైడ్ అందరు మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News