టాలీవుడ్ దూరమవుతున్న రష్మిక..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. అక్కడ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఒక రేంజ్ లో ఫాం కొనసాగిస్తుంది

Update: 2025-02-25 23:30 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. అక్కడ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఒక రేంజ్ లో ఫాం కొనసాగిస్తుంది. కన్నడలో కిరాక్ పార్టీ తో లైమ్ లైట్ లోకి వచ్చిన రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా హిట్ తో వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంది. టాలీవుడ్ లో స్టార్ ఛాన్స్ లతో అదరగొడుతున్న రష్మికకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అయినా కూడా తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చింది.

ఐతే బీ టౌన్ లో అమ్మడు చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుండటంతో అమ్మడికి తిరుగు లేని క్రేజ్ ఏర్పడింది. రష్మిక సినిమాలో ఉంది అంటే సినిమా సూపర్ హిట్టే అనే క్రేజ్ అటు బాలీవుడ్ లో కూడా పాకింది. అందుకే ఆమెకు సినిమా వెంట సినిమా ఛాన్సులు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కడో టాలీవుడ్ కి రష్మిక దూరమవుతుంది అన్న టాక్ వినిపిస్తుంది.

తనకు ఈ రేంజ్ పాపులారిటీకి కారణమైన టాలీవుడ్ ని దూరం చేసుకునే ఆలోచనలో లేదు రష్మిక. ప్రస్తుతం తెలుగులో అమ్మడు గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. మరోపక్క శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కుబేర సినిమాలో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత తెలుగులో మరో సినిమా చేయాలని అనుకుంటున్నా కూడా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందని తెలుస్తుంది.

రష్మిక పాపులారిటీని కనిపెట్టిన బాలీవుడ్ మేకర్స్ ఆమెను అక్కడే లాక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక పుష్ప 2 తో మరో హిట్ అందుకోగా ఈమధ్యనే చావా సినిమాతో సూపర్ హిట్ మేనియా కొనసాగిస్తుంది. ఇక ప్రస్తుతం సల్మాన్ తో సికందర్ సినిమా చేస్తున్న అమ్మడు మరో రెండు క్రేజీ ఆఫర్లు అందుకున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమాల వల్ల తెలుగు ఛాన్స్ లు వచ్చినా ఓకే చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని టాక్. అందం అభినయం రెండిటితో రష్మిక మందన్న అదరగొట్టేస్తుంది. సినిమాలో తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేస్తుంది అమ్మడు. అందుకే రష్మిక తో సినిమా అంటే స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు అమ్మడు పాన్ ఇండియా సినిమాలకు లక్కీ హీరోయిన్ కూడా అవ్వడంతో ఇక తిరుగు లేని క్రేజ్ సంపాదిస్తుంది రష్మిక.

Tags:    

Similar News