ర‌ష్మిక వెకేష‌న్ కోసం ఆ దేశానికే ఎందుకు?

గ‌డిచిన రెండేళ్లుగా వ‌రుస పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపింది. ఇంత‌కాలానికి ఒక చిన్న గ్యాప్ లో ఒమ‌న్ కి వెకేష‌న్ కోసం వెళ్లింది.;

Update: 2025-04-12 09:45 GMT
ర‌ష్మిక వెకేష‌న్ కోసం ఆ దేశానికే ఎందుకు?

సాటి క‌థానాయిక‌ల‌తో పోలిస్తే ర‌ష్మిక అదృష్టం ఓకింత ఎక్కువ‌. పూజా హెగ్డే, కియ‌రా అద్వాణీ లాంటి పోటీ నాయిక‌ల‌తో పోల్చినా ల‌క్ ఫేవ‌ర్ చేసింది ఈ భామ‌కు మాత్ర‌మే. కెరీర్ ప్రారంభించిన నాలుగైదేళ్ల‌కే పెద్ద స్టార్ అయిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఏల్తోంది. తెలుగు, హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల్లో బిజీ నాయిక‌గా ఓ వెలుగు వెలుగుతోంది.


గ‌డిచిన రెండేళ్లుగా వ‌రుస పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపింది. ఇంత‌కాలానికి ఒక చిన్న గ్యాప్ లో ఒమ‌న్ కి వెకేష‌న్ కోసం వెళ్లింది. అక్క‌డ ఎగ్జోటిక్ లొకేష‌న్ల నుంచి త‌న అద్భుత‌మైన ఫోటోగ్రాఫ్స్ ని ర‌ష్మిక షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా నల్లటి ట్యాంక్ టాప్ లేయర్డ్ ఎరుపు చొక్కా, తెల్ల ప్యాంటు, స్నీకర్లు ధ‌రించి క‌నిపించింది. దీనికి కూల్ బ్లూ టోపీని జ‌త చేసి స్టైలిష్‌గా కనిపించింది. సంధ్యా స‌మ‌యం లేలేత కిర‌ణాలతో ఆకాశం ఎరుపెక్క‌గా ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.


ఒకేసారి రెండు మూడు సినిమాల్లో న‌టించ‌డం అంటే ఊరిపాడ‌ని షెడ్యూళ్ల‌ను ఎదుర్కోవ‌డ‌మే. ఈ అల‌స‌ట నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అప్పుడ‌ప్పుడు ఇలాంటి జాలీ ట్రిప్స్ అవ‌స‌రం. విదేశీ విహార యాత్ర‌లో ర‌ష్మిక సేద దీరుతోంది. తదుపరి ఈ భామ `గర్ల్‌ఫ్రెండ్‌`లో కనిపిస్తుంది. పుష్ప 3లోను ర‌ష్మిక న‌టిస్తుంది.


Tags:    

Similar News