రూ.400 కోట్ల సినిమా... ఆశలన్నీ రష్మిక మీదే!
వికీ కౌశల్ హీరోగా రూపొందిన చావా సినిమాతో రష్మిక సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ లో మరింత రష్మిక క్రేజ్ పెరిగింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్ లో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. వికీ కౌశల్ హీరోగా రూపొందిన చావా సినిమాతో రష్మిక సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ లో మరింత రష్మిక క్రేజ్ పెరిగింది. గత ఏడాది చివర్లో అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన అంతకు ముందు ఏడాది బాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యానిమల్, పుష్ప 2 రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
యానిమల్ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూలు దక్కించుకుంటే, పుష్ప 2 సినిమా దాదాపు 2000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఈ రెండు సినిమాలతో పాటు రష్మిక మందన ఈ మధ్య కాలంలో నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ రేటు నమోదు అయ్యింది. అందుకే ఆమె ఒక సక్సెస్ మంత్రం గా ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. ఆమె నటిస్తే బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ సినిమాకు మంచి క్రేజ్ దక్కుతుంది అనే ఉద్దేశంతో పలువురు ఫిలిం మేకర్స్ ఆమెతో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న సికిందర్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సొంతం చేసుకుని చాలా సంవత్సరాలు అవుతోంది. అయినా కూడా దర్శకుడు మురుగదాస్ పై నమ్మకంతో నిర్మాతలు ఈ సినిమాకు ఏకంగా 400 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో రూ.100 కోట్ల బడ్జెట్‌తో సినిమా వస్తేనే బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటిది సల్మాన్ ఖాన్ తో 400 కోట్ల రూపాయలతో బడ్జెట్ కేటాయించి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.
రష్మిక మందన ఈ సినిమాలో నటించడం వల్ల ఖచ్చితంగా వందల కోట్ల కలెక్షన్లు వస్తాయని నమ్మకాన్ని ఫిలిం మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రష్మిక నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వస్తాయని సికిందర్ ఫిలిం మేకర్స్ ఆశతో ఉన్నారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న మేకర్స్ ఆశలు ఎంత వరకు నిజమవుతాయి.. అసలు రష్మిక హీరోయిన్‌గా నటించినంత మాత్రాన సినిమా సక్సెస్ దక్కించుకునేనా అనేది చూడాలి.