నేషనల్ క్రష్ ఒక్క ఫ్లాపే అనుకుంటే మాత్రం..!
సల్మాన్ ఖాన్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సికందర్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది.;

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు బాలీవుడ్ లో సికందర్ రూపంలో గట్టి షాక్ తగిలింది. సౌత్ లో స్టార్ రేంజ్ క్రేజ్ తెచ్చుకుని చిన్నగా బాలీవుడ్ వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఫస్ట్ రెండు సినిమాలు పెద్దగా బజ్ తెచ్చుకోలేదు. ఐతే నెక్స్ట్ యానిమల్ తో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 సినిమా మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకుంది. యానిమల్, పుష్ప 2 సినిమాల హిట్ తో రష్మిక రేంజ్ మారిపోయింది.
ఇక ఛావా సినిమాతో కూడా బాక్సాఫీస్ షేక్ చేసింది రష్మిక. సినిమా కథ కథనాలే కాదు రష్మిక లక్ కూడా ఆ సినిమాకు కలిసి వచ్చిందని అందరు అనుకున్నారు. ఐతే వరుస సినిమాలు వాటితో సూపర్ హిట్లు కొడుతూ వచ్చిన రష్మిక సికందర్ తో ఫస్ట్ షాక్ తిన్నది. సల్మాన్ ఖాన్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సికందర్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది.
ఈ సినిమాకు రష్మిక లక్ కలిసి వస్తుందని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. సికందర్ సినిమాకు ముందు నుంచి పెద్దగా బజ్ రాలేదు. సౌత్ లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్ ఈమధ్య అసలేమాత్రం ఫాం లో లేడు. ఐతే సల్మాన్ తో మురుగదాస్ మొదటి కొలాబరేషన్ కదా అని ఫ్యాన్స్ కాస్తో కూస్తో అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాలేదు.
రష్మిక మందన్న ఉన్నా కూడా సినిమా సక్సెస్ అవ్వలేదంటూ నేషనల్ మీడియా హంగామా మొదలు పెట్టింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో రష్మికకు ఈ ఫెయిల్యూర్ రిజల్ట్ ఒక బ్రేక్ లా అనిపించిందని చెప్పొచ్చు. ఒక్క ఫ్లాపే కదా అని తేలికగా తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే అమ్మడి నెక్స్ట్ సినిమాల మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాదు ఒక ఫ్లాప్ పడితే మళ్లీ సినిమా సూపర్ హిట్ పడే దాకా టెన్షన్ కొనసాగుతుంది.
ప్రస్తుతం రష్మిక ధనుష్ తో కుబేర సినిమా చేస్తుంది. మరోపక్క ఆమె లీడ్ రోల్ లో గర్ల్ ఫ్రెండ్ అంటూ ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా వస్తుంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితేనే రష్మిక మీద సికందర్ ఎఫెక్ట్ పడలేదన్నట్టు ప్రూవ్ అవుతుంది. ఐతే వీటిలో ఏది తేడా కొట్టినా కూడా రష్మిక కెరీర్ రిస్క్ లో పడినట్టే అవుతుంది. ఇక బాలీవుడ్ లో కూడా నెక్స్ట్ సినిమా విషయంలో రష్మిక ఆచి తూచి అడుగులేస్తుందని చెప్పొచ్చు. సో రష్మిక కూడా కెరీర్ ఎంత పీక్స్ లో ఉన్నా ఒక్క ఫ్లాప్ వల్ల మొత్తం తలకిందులు అయ్యే ఛాన్స్ ఉందన్న విషయాన్ని తెలుసుకుందని చెప్పొచ్చు.