రాజమౌళి కూడా చేయలేనిది.. సుకుమార్ ఎలా చేస్తున్నాడు..?
తెలుగు సినిమా స్థాయిని బాహుబలితో పెంచాడని రాజమౌళిని గొప్పగా చెప్పుకుంటాం.
తెలుగు సినిమా స్థాయిని బాహుబలితో పెంచాడని రాజమౌళిని గొప్పగా చెప్పుకుంటాం. బాహుబలి వల్లే తెలుగు సినిమా ప్రాంతీయ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లింది. అందుకే రాజమౌళి దారిలోనే తెలుగు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే ఆఫ్టర్ జక్కన్న సుకుమార్ కూడా ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. పుష్ప 1తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సుకుమార్ పుష్ప 2 మీద ఉన్న అంచనాలకు తగినట్టుగానే సినిమా చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా విషయంలో సుకుమార్ చేస్తున్న హార్డ్ వర్క్ అందరికి తెలిసిందే.
డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఐతే రాజమౌళి కూడా బాహుబలిని రెండు భాగాలే చేశాడు. కానీ సుకుమార్ మరో అడుగు ముందుకు వేస్తూ పుష్ప 3వ భాగం కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయం నిన్న మొన్నటి దాకా డౌట్ గా ఉండగా చెన్నైలో జరిగిన ఈవెంట్ లో రష్మిక మాటలను బట్టి పుష్ప 3 కూడా కన్ఫర్మ్ అని తెలుస్తుంది. పుష్ప 3 సినిమా విషయంలో సుక్కు ప్లాన్ ఏంటి..? అసలు పుష్ప 2 ని ఎలా కొనసాగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులకు పుష్ప రాజ్ దగ్గరయ్యాడు. అందుకే ఆయన క్యారెక్టరైజేషన్ బేస్ మీదే పుష్ప 2 కాదు పుష్ప 3 కూడా కథ సిద్ధం చేసుకున్నాడట సుకుమార్. ఐతే రాజమౌళి కూడా ఒక సినిమాను రెండు భాగాలకే ముగిస్తే సుకుమార్ మరో పార్ట్ కూడా తీస్తా అంటున్నాడు. పుష్ప 2 అనుకున్న విధంగా సూపర్ హిట్ అయితే పార్ట్ 3 కి కూడా ఇదే రేంజ్ బజ్ ఉంటుంది. సో ఆ లెక్కన రాజమౌళి చేయలేనిది సుకుమార్ చేసి చూపించాడనే చెప్పొచ్చు.
రాజమౌళి, సుకుమార్ లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వారు అనుకున్నంత పర్ఫెక్ట్ గా సినిమా రాకపోతే సినిమాను తీస్తూనే ఉంటారు. అందుకే వాళ్ల సినిమాలు రిలీజ్ అనుకున్న డేట్ కి ఎప్పుడు రాలేదు. పుష్ప 2 ని కూడా ఆగష్టుకి అనుకున్నారు డిసెంబర్ కి తెస్తున్నారు. ఇప్పటికి కూడా పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో సుకుమార్ బిజీగా ఉన్నాడు. మరి పుష్ప 2 ఎలా ఉంటుంది.. పార్ట్ 3 కి ఎలా లీడ్ ఇస్తారన్నది ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది.