ర‌ష్మిక మ‌ళ్లీ ఉల్లాసంగా ఉత్సాహంగా!

ప్ర‌చార స‌మ‌యంలో ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు త‌మ వంతు స‌హ‌కారం అందిస్తుంటారు.;

Update: 2025-03-19 05:08 GMT

సినిమా ప్ర‌చార‌మంటే కొంద‌రు హీరోయిన్లు ఎలా స్కిప్ కొట్టాలా? అని చూస్తుంటారు. ఆ ఛాన్స్ ఏ రూపంలో వ‌స్తుందా? ఎస్కేప్ అయిపోదామా? అని చూస్తుంటారు. త‌మ పార్ట్ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత పారితో షికం తీసుకుని చెక్కేయాల‌నే చూస్తుంటారు. చాలా కొద్ది మంది మాత్ర‌మే సినిమా మొద‌లు నుంచి రిలీజ్ వ‌ర‌కూ ఎరకూ అంకిత భావంతో ప‌నిచేస్తుంటారు. ప్ర‌చార స‌మ‌యంలో ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు త‌మ వంతు స‌హ‌కారం అందిస్తుంటారు.

అలాంటి వాళ్ల‌లో ముందున్న‌ది ఎవ‌రు? అంటే నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మికా మంద‌న్నా అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ర‌ష్మిక సినిమాలో హీరోయిన్ అయినా రిలీజ్ వ‌ర‌కూ ప్ర‌చారాన్ని కూడా త‌న భుజాల‌పై వేసుకుని మోస్తుంది. సినిమాని జ‌నాల్లోకి వెళ్లేలా త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'ఛావా' ప్ర‌చారానికి ఎలాంటి స్టేజ్ లో వ‌చ్చిందో తెలిసిందే.

న‌డ‌వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నా..వీల్ చైర్ కి అంకిత‌మైనా? 'ఛావా' సినిమాని ద‌గ్గ‌రుండి ప్ర‌మోట్ చేయాల‌నే కృత నిశ్చ‌యంతో వీల్ చైర్ లోనే ప్ర‌చార కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. అప్పుడే మ‌రోసారి ప్ర‌చారం విష‌యం లో ర‌ష్మిక ఎంత క‌మిట్ మెంట్ తో ఉంటుంద‌న్న‌ది అర్ద‌మైంది. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక నంటిచ‌న 'సికింద‌ర్' కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇటీవల ముంబైలో 'సికిందర్' నుండి ఒక కొత్త పాట లాంచ్ సందర్భంగా కనిపించింది.

దీంతో వ‌చ్చే వారం నుంచి ర‌ష్మిక 'సికింద‌ర్' రిలీజ్ అయ్యే వ‌ర‌కూ ప్ర‌చారం ప‌నుల్లోనే నిమ‌గ్న‌మ వుతుంద‌ని తెలుస్తోంది. అన్ని ఇంటర్వ్యూలు, ఈవెంట్‌లు , ఇత‌ర ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటుంది. 'ఛావా' త‌ర్వాత మ‌ళ్లీ వెంట‌నే బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్ల‌డం కోసం ర‌ష్మిక కూడా అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News