నేషనల్ క్రష్ అవ్వడం వెనక ఇంత స్టోరీ ఉందా..?

ఒక సినిమా కోసం రష్మిక ఆడిషన్ కు వెళ్తే నటించడానికి పనికొచ్చే ముఖమేనా అని తన ఫేస్ మీదే అన్నారని చెప్పుకొచ్చింది.

Update: 2024-08-13 03:47 GMT

కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు ఇటు తెలుగు, తమిళ్ తో పాటుగా అటు హిందీ పరిశ్రమలో కూడా రాణిస్తుంది. యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక ఆ క్రేజ్ తో వరుస ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న ఛావా సినిమాలో నటిస్తుంది రష్మిక. ఐతే ఇప్పుడు తన క్రేజ్ చూసి అంతా ఆహా ఓహో వావ్ సూపర్ అనేస్తున్నారు కానీ ఒకప్పుడు రష్మికని ఎవరు పట్టించుకోలేదట. తను చాలా ఆడిషన్స్ కి వెళ్లినా సెలెక్ట్ కాలేదట. రీసెంట్ గా అమ్మడు ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించింది.

ఒక సినిమా కోసం రష్మిక ఆడిషన్ కు వెళ్తే నటించడానికి పనికొచ్చే ముఖమేనా అని తన ఫేస్ మీదే అన్నారని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఒక సినిమా కోసం చాలాసార్లు ఆడిషన్ ఇచ్చా దాదాపు సెలెక్ట్ అయినట్టే అనుకున్నా.. రెండు నెలలు వర్క్ షాప్ కూడా జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ టైం లో విషయం తెలుసుకుని ఏడ్చేశానని చెప్పింది రష్మిక. స్క్రీన్ మీద పరిచయం అవ్వడం కోసం దాదాపు పారిక ఆడిషన్స్ దాకా ఇచ్చానని చెప్పుకొచ్చింది రష్మిక.

నా నటనపై ఎప్పుడు వాళ్లకు అనుమానం ఉండేది. కెరీర్ లోనే ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నా ఇప్పటికీ ఏదైనా సినిమా చూస్తే ఇంకాస్త బాగా చేస్తే బాగుంటుందని అనుకుంటానని చెప్పింది రష్మిక. ఇప్పుడు నేషనల్ క్రష్ అని ప్రేక్షకులు సూపర్ అనిపిస్తున్న రష్మిక సినిమాల్లోకి రావడం వెనక ఇంత స్టోరీ నడిచింది. ఆమె నా వల్ల కాదు అనుకుంటే ఇప్పుడు ఇంత మంచి సినిమాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది.

ప్రస్తుతం రష్మిక కుబేర, పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఐతే ఏదో సినిమాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఎంచుకున్న పాత్రల్లో తన 100 పర్సెంట్ ఇస్తూ తన మార్క్ చాటుతూ వస్తుంది రష్మిక. కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో అమ్మడు సెపరేట్ క్రేజ్ తెచ్చుకుంది. మళ్లీ మళ్లీ అలాంటి ఛాన్సులు రావాలని కోరుకుంటుంది రష్మిక.

Tags:    

Similar News