ర‌ష్మిక‌క‌కు ఇప్పుడేం ఇబ్బంది లేదా?

స్కిన్ టైట్ దుస్తుల్లో.... ప్లోర‌ల్ డిజైన్స్ లో మెరిసే క్ర‌మంలో! అల‌వాటు లేని ప‌ని కావ‌డంతో కెమారా ముందు ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. అయితే ఇప్పుడా ఇబ్బందుల‌న్నీ అనుభ‌వంగా మారిపోయాయి.

Update: 2024-04-28 13:30 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడే రేంజ్లో పాన్ ఇండియా స్థాయిని ఆస్వాదిస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. 'పుష్ప‌'..'యానిమ‌ల్' సినిమాల‌తో తాను సైతం ఊహించ‌ని స్థాయికి చేరిపోయింది. క‌న్న‌డ‌లో ఎంతో చిన్న‌గా మొద‌లైన కెరీర్ నేడు దేశ వ్యాప్త‌మైంది. క‌న్న‌డ నుంచి టాలీవుడ్ కి రావ‌డం..ఇక్క‌డ నుంచి బాలీవుడ్ కి వెళ్ల‌డం! ల‌క్కీగా చేసిన సినిమాల‌న్నీ స‌క్సెస్ అవ్వ‌డం ఇలా అన్నింటా రష్మిక‌కు క‌లిసిసొచ్చింద‌నే చెప్పాలి.

ఇక బాలీవుడ్ కి వెళ్లే క్ర‌మంలో త‌న‌ని తాను అమ్మ‌డు ఎంత‌లా మౌల్డ్ చేసుకుందో తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్నంత కాలం సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించిన అమ్మ‌డు బాలీవుడ్ కి వెళ్లే స‌రికి అక్క‌డి క‌ల్చ‌ర్ కి త‌గ్గ‌ట్టు ఎన్నో మార్పులు చేసింది. ఆహార్యం ద‌గ్గ‌ర నుంచి వేసుకుని డిజైన‌ర్ దుస్తుల వ‌ర‌కూ ప్ర‌తీదానిలో ఎన్నో మార్పులు చేసింది. చిట్టిపొట్టి దుస్తులు ధ‌రించిన స‌మ‌యంలో ఎంత‌టి అసౌక‌ర్యానికి గురైందో కూడా తెలిసిందే.

బాలీవుడ్ మీడియా ముందు డిజైనర్ దుస్తుల్లో ఫోక‌స్ అవ్వ‌డానికి ఎంతో ఇబ్బంది ప‌డింది. స్కిన్ టైట్ దుస్తుల్లో.... ప్లోర‌ల్ డిజైన్స్ లో మెరిసే క్ర‌మంలో! అల‌వాటు లేని ప‌ని కావ‌డంతో కెమారా ముందు ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. అయితే ఇప్పుడా ఇబ్బందుల‌న్నీ అనుభ‌వంగా మారిపోయాయి. ఇప్పుడెలాంటి అసౌక‌ర్యానికి గురికాకుండా ఎంతో కంప‌ర్ట్ గా క‌నిపిస్తుంది. మునుప‌టి కంటే ప్రీగా ఉండ‌గ‌లుగుతుంది. త‌న‌లో ఉన్న సిగ్గు బిడియం పూర్తిగా ప‌క్క‌న‌బెట్టి అక్క‌డ మీడియాతోనూ గ‌ల‌గ‌లా మాట్లాడేస్తుంది.

టాలీవుడ్ లో అలా ఉండే ! అంత‌గా పాపుల‌ర్ అయింది. సినిమాల‌కంటే ముందే ఆర‌క‌మైన చాక‌చ‌క్యంతోనే తెలుగు ఆడియ‌న్స్ కి ద‌గ్గ‌రైంది. బాలీవుడ్ లోకూడా ఇప్పుడ‌దే స్ట్రాట‌జీతో ముందుకెళ్తుంది. అద‌నంగా అక్క‌డ గ్లామ‌ర్ షో కూడా క‌లిసొస్తుంది కాబ‌ట్టి రీచ్ అవ్వ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. ప్ర‌స్తుతం ర‌ష్మిక చేతిలో ఐదారు సినిమాలున్నాయి. తెలుగు..త‌మిళ్..హిందీ అన్ని భాష‌ల్లో ప‌నిచేస్తుంది. అవ‌స‌రం మేరు రోజుకు మూడు షిప్ట్ లకు సైతం సిద్ద‌మంటోంది.

Tags:    

Similar News