జపాన్ లో రష్మికతో వ్యవహరమంటే అట్లుంటది!
తాజాగా రష్మిక క్రేజ్ దేశం దాటి విదేశాలకు సైతం పాకేసింది. రష్మిక విదేశీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే సరికి ఏకంగా అమ్మడి కోసం అభిమానులు ప్లకార్డులతో గ్రాండ్ గా స్వాగతం పలికారు.
నేషనల్ క్రష రష్మిక మందన్నా పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప'తో పాన్ ఇండియా లో లాంచ్ అయిన అమ్మడు అటుపై రిలీజ్ అయిన 'యానిమల్' తో అంతకంతకు రెట్టింపు క్రేజ ని సొంతం చేసుకుంది. రష్మిక అంటే నేడు మార్కెట్ లో ఓ బ్రాండ్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అమ్మడితో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు సైతం తెరకెక్కిస్తున్నారు.
తాజాగా రష్మిక క్రేజ్ దేశం దాటి విదేశాలకు సైతం పాకేసింది. రష్మిక విదేశీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే సరికి ఏకంగా అమ్మడి కోసం అభిమానులు ప్లకార్డులతో గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఇంతకీ ఏ దేశంలో ఈ స్వాగతం లభించింది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. టోక్యోలో జరిగే క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు రష్మికకు అవకకాశం దక్కింది. గ్లోబల్ ఈవెంట్ గా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖులు పాల్గొంటున్నారు.
దేశం తరుపున రష్మిక ఈ అరుదైన అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. నటిగా రష్మిక కి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం ఇది. ఇంతవరకూ ఏ నటి ఈ వెంట్ లో పాల్గోనలేదు. తొలిసారి ఆ ఛాన్స్ రష్మికకే వచ్చింది. ఈ సందర్బంగా రష్మిక ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే అమ్మడి గ్రాండ్ గా స్వాగతం లభించింది. జపాన్ లో రష్మిక అభిమానులు....ఈవెంట్ నిర్వాహకులు ఆమెని సాదరంగా స్వాగతించారు.
రష్మిక ఫొటోస్ తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ ఆమెను సర్ ప్రైజ్ చేసారు. ఎయిర్ పోర్ట్ లో అంత అభిమానుల్ని చూసి రష్మిక ఆశ్చర్యపోయింది. సర్ ప్రైజ్ అవుతూ వారికి హాయ్ చెప్పింది. అభిమానుల్ని చూసి రష్మిక సంతోషం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన వీడయో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం రష్మిక మందన్న 'పుష్ప 2'.. 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.