ఇంత బాధలోను దానికి అడ్డు చెప్పని విజయ్ ఆంటోని
కానీ విజయ్ ఆంటోని దానికి విరుద్ధం. అతడు తన కూతురు చనిపోయినప్పటికీ ఇంత బాధలోనూ రిలీజ్ ఆపడం తనకు ఇష్టం లేదని సినిమాను యతాథతంగా ప్రకటించిన తేదీకే విడుదల చేయాలని మేకర్స్‌ని కోరాడు.
సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేసిన విజయ్ ఆంటోని 'రథం' ఇటీవల అక్టోబర్ 6కి రీషెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలోనే విజయ్ ఆంటోని కూతురు బలవన్మరణానికి పాల్పడడంతో మరోసారి ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందని భావించారు. కానీ విజయ్ ఆంటోని దానికి విరుద్ధం. అతడు తన కూతురు చనిపోయినప్పటికీ ఇంత బాధలోనూ రిలీజ్ ఆపడం తనకు ఇష్టం లేదని సినిమాను యతాథతంగా ప్రకటించిన తేదీకే విడుదల చేయాలని మేకర్స్‌ని కోరాడు. తన వ్యక్తిగత కారణాన్ని వృత్తిలోకి తీసుకురాలేనని అన్నట్టు తెలిసింది. అంతేకాదు.. తాను సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటానని, తన కూతురు మీరా లేని లోటు భర్తీ చేయలేనిదని కానీ ప్రచారంలో నిమగ్నం అవ్వడం మరుపునిస్తుందేమోనని అతడు ఆవేదనగా అన్నారు.
విజయ్ ఆంటోని నటించిన 'రథం' నిర్మాతలు తాజాగా మరోసారి విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ 28న విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 6కి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడితే నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే తన నిర్మాతల పక్షాన నిలిచిన విజయ్ ఆంటోని వారికి ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు వారు ఇచ్చిన మాట ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 6న పెద్ద తెరపైకి రానుందని ధృవీకరించారు.
CS అముధన్ దర్శకత్వం వహించిన 'రథం' క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందింది. ఇందులో విజయ్ ఆంటోని క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించాడు. అతడి పాత్రలో డ్యూయల్ షేడ్ ఆకట్టుకుంటుందని తెలిసింది. ఈ చిత్రంలో నందితా శ్వేత, మహిమా నంబియార్, రమ్య నంబీషన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తమిజ్ పదం అనే పేరడీ సిరీస్‌తో పాపులర్ అయిన సిఎస్ అముధన్ ఈసారి థ్రిల్లర్ డ్రామాని ఎంపిక చేసుకుని పెద్ద హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు. ఈ చిత్రానికి గోపి అమర్‌నాథ్ సినిమాటోగ్రఫీ అందించగా, కన్నన్ నారాయణన్ సంగీతం అందించారు. ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా సెన్సార్ వివరాలు వెల్లడయ్యేందుకు ఛాన్సుంది.