ఈ నటిని స్నేహితురాలే వెన్నుపోటు పొడిచిందా?
అతడి సరసన ఆమె నటిస్తే బంపర్ హిట్టే. వరుస విజయాలతో `హిట్ పెయిర్`గా వెలిగిపోయాక ఊహించని ట్విస్టు ఎదురైంది.
అతడి సరసన ఆమె నటిస్తే బంపర్ హిట్టే. వరుస విజయాలతో `హిట్ పెయిర్`గా వెలిగిపోయాక ఊహించని ట్విస్టు ఎదురైంది. అతడి సరసన ఆమె ఇదే జోరు కొనసాగిస్తే, అగ్ర హీరోయిన్ హోదాలో తనను చూడాల్సి రావటం చాలా కష్టమని భావించిన తన స్నేహితురాలు ఒకరు, వేరొక హీరోయిన్ ని నెమ్మదిగా ఆ హీరోకి పరిచయం చేసింది. హిట్ పెయిర్ మధ్య మంచి స్నేహ సంబంధాన్ని ఇది బ్రేక్ చేసింది.
అయితే స్నేహితురాలే తనపై ఎందుకు ఇలా వెన్ను పోటు పొడిచింది? అంటే.. దానికి కారణం అసూయ, జెలసీ అనే రెండు భయంకర లక్షణాలు. తన ఎదుగుదల స్నేహితురాలికే నచ్చలేదు. ఇక చుట్టూ ఉన్నవారికి నచ్చుతుందా? అలా కుట్రలు మొదలయ్యాయి. ఎంతగా అంటే.. ఇక ఆ హీరో సరసన తనకు ఎప్పటికీ ఆఫర్ రానంతగా చుట్టూ కంచె వేసారు.
అలాంటి పరిస్థితుల్లో కూడా నటిగా నిలదొక్కుకునేందుకు తన ప్రతిభ నిజాయితీ మాత్రమే తనకు సహకరించాయి. తన స్నేహితురాలు కానీ, తన చుట్టూ ఉన్న మంది మార్భలం కానీ తనకు ఎంతమాత్రం సహకరించలేదు. చివరికి సదరు హీరోగారు తనను వెతుక్కుంటూ వచ్చి, హ్యాండిచ్చిన ప్రస్తుత ప్రియురాలి స్థానంలో నటించాల్సిందిగా కోరితే ఎలాంటి సమాధానం చెప్పాలి.
నిజానికి ఈ నటి ఎంతో ఛమత్కారమైన జవాబు ఇచ్చింది. తామిద్దరూ గతంలో విడిపోవడానికి కారణమైన ఆ చెత్త స్వభావాల గురించి అతడికి గుర్తు చేసింది. ఈ ఎపిసోడ్ నిజజీవితంలోనిది. అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ? చిత్రపరిశ్రమలో అప్పటికప్పుడు మారిపోయే మనుషులు ఎలా ఉంటారో , మేక వన్నె పులులు ఎలా కాపు కాసుకుని కూచుంటారో ఈ అనుభవాలు చెబుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ మరెవరో కాదు.. అందాల నటి రవీనా టాండన్. బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు లాంటి బ్లాక్ బస్టర్ లో రవీనా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల కేజీఎఫ్ 2లోను కీలక పాత్రను పోషించింది. రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ బాలీవుడ్ కి పరిచయమైంది. మరోవైపు రవీనా టాండన్ తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అక్షయ్ కుమార్ తో సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్షయ్ మరో సహనటి ట్వింకిల్ ఖన్నాను పెళ్లాడాడు.