క్యాస్టింగ్ కౌచ్.. ఫేమస్ నటుడి కామెంట్స్ ఇలా..
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా క్యాస్టింగ్ కౌచ్ పదం వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పలువురు సెలబ్రిటీలు ఆ విషయంపై మాట్లాడుతుంటారు.
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా క్యాస్టింగ్ కౌచ్ పదం వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పలువురు సెలబ్రిటీలు ఆ విషయంపై మాట్లాడుతుంటారు. ఆ నేపథ్యంలోనే నటుడు రవి కిషన్ ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు.
క్యాస్టింగ్ కౌచ్ సమస్యను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పారు రవికిషన్. సమస్యలు వచ్చినప్పుడు తాను ధైర్యంగా ఉన్నట్లు తెలిపారు. తమది చాలా పేద కుటుంబమని అన్నారు. కుటుంబ పోషణ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనిపించిందని పేర్కొన్నారు. యంగ్ ఏజ్ లోనే బిహార్ లోని తన స్వగ్రామాన్ని విడిచిపెట్టానని తెలిపారు.
ముంబై వచ్చాక.. మొదట్లో చాలా సమస్యలు ఎదురయ్యాయని వెల్లడించారు. చేతిలో డబ్బులు లేకపోతే చాలు.. మనం ఉన్న పరిస్థితి తెలుసుకుని ఇబ్బంది పెట్టేందుకు కొందరు రెడీగా ఉంటారని అన్నారు. అలాంటి వారు ఎక్కడైనా ఉంటారని చెప్పారు. కేవలం సినీ ఫీల్డ్ లోనే కాదు.. అన్ని రంగాల్లో ఇది కామన్ అని తెలిపారు.
అలాంటి సందర్భాలు దాటుకుని ఈ స్థాయికి వచ్చానని రవి కిషన్ తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. విక్టరీకి ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవని చెప్పారు. అలాంటి షార్ట్ కట్స్ సెలెక్ట్ చేసుకున్న ఎంతో మంది తనకు తెలుసని, ఆ తర్వాత వారు చాలా బాధపడ్డారని పేర్కొన్నారు. చివరకు కొందరు సూసైడ్ చేసుకోగా.. మరికొందరు చెడు అలవాట్లకు బానిసయ్యారని తెలిపారు.
అందుకే షార్ట్ కట్ లో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న వారు.. ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు. టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయమని సూచించారు. అయితే రవి కిషన్ కామెంట్స్.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక గతంలో ఒక మహిళ తనను ఇబ్బంది పెట్టేందుకు ట్రై చేశారని ఆరోపించారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చక్కర్లు కొట్టాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. భోజ్ పురి, హిందీ భాషల్లో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు రవి కిషన్. అల్లు అర్జున్ రేసుగుర్రం మూవీ టాలీవుడ్ లోకి వచ్చారు. తన యాక్టింగ్ తో ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అనేక తెలుగు చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కానున్న బాలయ్య డాకు మహారాజ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఆ సినిమాతో ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.