మాస్ జాతర.. AIతో తిరిగొచ్చిన చక్రి గానం..

క్రి గాత్రాన్ని AI తో పునరావృతం చేయడం, అలాగే ఆ స్టైల్‌లో కొత్త బీట్‌తో ట్యూన్ చేయడం నిజంగా వినూత్నం.;

Update: 2025-04-14 12:10 GMT
మాస్ జాతర.. AIతో తిరిగొచ్చిన చక్రి గానం..

మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర' పై ప్రేక్షకుల అంచనాలు హై లెవెల్లోనే ఉన్నాయి. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోగా, తాజాగా వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘తు మేరా లవర్’ పాటతో సినిమా మరోసారి హైప్‌లోకి వచ్చింది.

 

ఈ పాట ప్రోమో చూసినప్పటినుంచి అందరిలోనూ ఆసక్తి పెరిగింది. “చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే” అంటూ ఒకప్పుడు చక్రి కంపోజ్ చేసిన సూపర్ హిట్ పాటకు ఇది ఓ మ్యూజికల్ ట్రిబ్యూట్. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే.. చక్రి స్వరాన్ని ఏఐ టెక్నాలజీతో తిరిగి జీవింపజేశారు. ఈ ప్రయత్నం సంగీతప్రేమికులను, రవితేజ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ పాటలో భీమ్స్ చేసిన కంపోజిషన్, భాస్కరభట్ల సాహిత్యం పాటను స్పెషల్‌గా మార్చాయి.

ఇక చక్రి వాయిస్ వింటుంటే మళ్ళీ ఆయనే పాడినట్లు ఉందని.నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ పాటలో రవితేజ-శ్రీలీల జోడీ మరోసారి రొమాంటిక్ మాస్ కెమిస్ట్రీని పాజిటివ్ వైబ్ లో చూపించారు. స్టైలిష్ లుక్‌లో కనిపించిన రవితేజకు టెంపరేచర్ పెరిగేలా శ్రీలీల డ్యాన్స్ అదనపు ఆకర్షణగా నిలిచింది. పాట విజువల్స్ కూడా చాలా ఎనర్జిటిక్ గా వచ్చాయి.

యూత్‌కి, మాస్ ఆడియన్స్‌కి రెండింటికీ కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్‌ను డిజైన్ చేయడం ప్రత్యేకత. చాలా కాలం తరువాత రవితేజ మళ్లీ తన మాస్ స్టామినా చూపించబోతున్నాడని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఐతే ఈ పాటలో ‘చక్రి’ టచ్ ఉండటంతో సీనియర్ సంగీతప్రేమికులలోనూ ఒక తీపి జ్ఞాపకాన్ని తెచ్చిపెట్టింది. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో, అది మన సంస్మరణలను ఎలా తిరిగి తెచ్చగలదో ఈ పాట ఓ ఉదాహరణ.

చక్రి గాత్రాన్ని AI తో పునరావృతం చేయడం, అలాగే ఆ స్టైల్‌లో కొత్త బీట్‌తో ట్యూన్ చేయడం నిజంగా వినూత్నం. ఈ పాట విజయంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. దర్శకుడు భాను బోగవరపు తన తొలి సినిమాతోనే మాస్ మిక్స్‌ని పక్కాగా చూపిస్తున్నారు. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ సపోర్ట్‌తో ఈ చిత్రం టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్‌గా నిలవనుందట. ఇక త్వరలో సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

Full View
Tags:    

Similar News