ఎమోషనల్ డైరెక్టర్ తో మాస్ రాజా
సినిమాల హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా రవితేజ ఎప్పుడూ సినిమాల మీద ఫోకస్ పెడుతూనే ఉంటాడు. ఇక రీసెంట్ గా కొన్ని వరుస అపజయాలు ఎదురైన విషయం తెలిసిందే.
టాలీవుడ్‌లో మాస్ హీరో అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రవితేజ పేరు. కెరీర్ ప్రారంభంలో సహాయక పాత్రలు, సైడ్ రోల్స్ చేసిన రవితేజ, కష్టపడి టాప్ హీరోగా నిలిచాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, నటుడిగా సొంత గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పటికీ అదే ఎనర్జీతో ముందుకెళ్తూనే ఉన్నారు. కొంతమంది హీరోలకు యాంటీ ఫ్యాన్స్ ఉన్నా, రవితేజకు అలాంటి విభేదాలు తక్కువ. మాస్ మహారాజా సినిమాలంటే థియేటర్లలో ఊర మాస్ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రేక్షకుల మైండ్‌సెట్. ఇప్పుడు రవితేజ తన కెరీర్‌లో మరో కీలక దశలో ఉన్నాడు.
సినిమాల హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా రవితేజ ఎప్పుడూ సినిమాల మీద ఫోకస్ పెడుతూనే ఉంటాడు. ఇక రీసెంట్ గా కొన్ని వరుస అపజయాలు ఎదురైన విషయం తెలిసిందే. చివరగా ధమాకా సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాతో దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, రవితేజ మళ్లీ తన మాస్ పవర్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ అదే సమయంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు.
అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా ఆశించిన రీతిలో నిలబడలేదు. అయితే రవితేజ మాత్రం వెనుకడగా వేయకుండా వరుసగా సినిమాలు లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు రవితేజ రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ను అంగీకరించినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్.
నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి ఎమోషనల్ డ్రామాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల ఇటీవల రవితేజకు ఓ కథ చెప్పినట్లు సమాచారం. కథ నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, మ్యాడ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కళ్యాణ్ శంకర్ కూడా రవితేజకు ఓ స్టోరీ నరేట్ చేశారని, ఆ కథ కూడా హీరోను బాగా ఆకట్టుకుందట. ఆ
ఇప్పుడు ఈ రెండు కథల్లో ముందుగా కిషోర్ కథ సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఎమోషనల్ డ్రామాగా ఉండే ఈ కథ విషయంలో మాస్ రాజా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్ కథపై మరోసారి చర్చలు జరిపిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి రావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.