రవితేజ కూడా ఆ పండక్కే..

మాస్ మహారాజ్ రవితేజ హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.

Update: 2024-05-28 04:05 GMT

మాస్ మహారాజ్ రవితేజ హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. యాక్షన్ కథలని ఓ వైపు చేస్తూ మరో ఎండ్ తో తన బ్రాండ్ అయిన కమర్షియల్ కామెడీ చిత్రాలని కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

దీని తర్వాత రవితేజ 75వ చిత్రం స్టార్ట్ కాబోతోంది. సామజవరగమన ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ ఈ చిత్రం చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే మూవీలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ శ్రీలీలని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే శ్రీలీల రవితేజకి జోడీగా ధమాకా మూవీలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రవితేజ ఎనర్జీ లెవల్స్ ని మ్యాచ్ చేస్తూ శ్రీలీల ధమాకా చిత్రంలో నటించింది. ప్రస్తుతం రవితేజ 75 మూవీ కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కనుందట. రవితేజ ఎనర్జీని అందుకోవాలంటే శ్రీలీల కరెక్ట్ ఛాయస్ అని ఆమెని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని సితార ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, వెంకటేష్ అనిల్ రావిపూడి మూవీ, నాగార్జున బంగార్రాజు 2 ఇంచుమించు బెర్త్ ఖరారు చేసుకున్నాయి. అలాగే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి రిలీజ్ డేట్ కోసం పోటీలో ఉన్నాయి.

ఇంత టైట్ ఫైట్ మధ్యలో రవితేజ సినిమాని కూడా సంక్రాంతి రేసులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. 2024లో సితార వారి మెయిన్ బ్యానర్ అయిన హారికా హాసిని నుంచి గుంటూరు కారం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా పోటీలో ఉండాలని రవితేజ సినిమాతో రావడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి రవితేజ 75ని అనుకున్న ప్లాన్ ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయగలరో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News