రెజీనా.. ఇప్పటికైనా క్లిక్కయ్యేనా?

ఆమె ఏడాది క్రితం కంప్లీట్ చేసిన ఉత్సవం అనే మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కోసం రెజీనా గట్టిగానే ప్రమోషన్ చేస్తోంది.

Update: 2024-09-13 04:19 GMT

కొంతమంది హీరోయిన్స్ అందం, అభినయం ఉన్న కూడా ఆశించిన స్థాయిలో కమర్షియల్ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోతారు. అలాంటి వారిలో రెజీనా కాసాండ్రా కూడా ఉంటుంది. ఈ బ్యూటీ 2005లో మాతృభాష తమిళ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. అయితే 2010లో శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన మొదటి చిత్రం ఇది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సందీప్ కిషన్ కి జోడీగా రొటీన్ లవ్ స్టోరీ మూవీ చేసింది. ఈ మూవీ బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. తరువాత రారా క్రిష్నయ్య చిత్రంలో మరల సందీప్ కిషన్ తో జతకట్టింది. అయితే రవితేజతో చేసిన పవర్, సాయి ధరమ్ తేజ్ మొదటి చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం రెజీనాకి కమర్షియల్ బ్రేక్ ఇచ్చాయి. అక్కడి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

తెలుగు, తమిళ్ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రెజీనా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఛాన్స్ లు తగ్గిన మాతృభాష తమిళంలో మాత్రం బాగానే అవకాశాలు అందుకుంది. 2019లో తెలుగులో 'ఎవరు' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె చివరిగా సక్సెస్ అందుకుంది. తరువాత తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే చెప్పుకోదగ్గ సక్సెస్ లు రాలేదు. 2022లో శాకినీ డాకినీ మూవీతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.

మంచి టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న కూడా రెజీనా కాసాండ్రా కమర్షియల్ హీరోయిన్ కాలేకపోయింది. ఆమె ఏడాది క్రితం కంప్లీట్ చేసిన ఉత్సవం అనే మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా కోసం రెజీనా గట్టిగానే ప్రమోషన్ చేస్తోంది. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. అయితే రెజీనానే ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని తన భుజాలపై వేసుకొని చేస్తోంది.

ఈ సినిమా సక్సెస్ అయితే మరల తెలుగులో అవకాశాలు పెరుగుతాయని ఈ బ్యూటీ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. తమిళంలో రెండు, హిందీలో రెండు సినిమాలలో రెజీనా నటిస్తోంది. అయితే అవి లీడ్ రోల్స్ కాదంట. దీంతో హీరోయిన్ గా మరల ఛాన్స్ లు పెరగాలంటే ఒక్క కమర్షియల్ సక్సెస్ కావాలని భావిస్తోంది. ఉత్సవం కంటెంట్ బాగుండటం తో ఆడియన్స్ కి నచ్చుతుందని ఈ సినిమాని బలంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరి ఆమె ప్రయత్నం వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News