35 ఏళ్ల న‌టి మృతి..షాక్ లో ఇండ‌స్ట్రీ!

మ‌ల‌యాళ న‌టి రెంజూషా మేన‌న్ (35) అనుమానాదాస్ప‌ద స్థితిలో మృతి చెందిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. తిరువ‌నంత‌పురంలో త‌న నివాస‌రంలో సోమ‌వారం ఉద‌యం రెంజూషా విగ‌త జీవిగా క‌నిపించారు.

Update: 2023-10-30 16:25 GMT

మ‌ల‌యాళ న‌టి రెంజూషా మేన‌న్ (35) అనుమానాదాస్ప‌ద స్థితిలో మృతి చెందిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. తిరువ‌నంత‌పురంలో త‌న నివాస‌రంలో సోమ‌వారం ఉద‌యం రెంజూషా విగ‌త జీవిగా క‌నిపించారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో హుటాహుటిన స్పాట్ కి చేరుకుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమిక ద‌ర్యాప్తు అనంత‌రం పోలీసులు రెంజుషా మృతిని ఆత్మ‌హ‌త్య‌గా భావిస్తున్నారు.

శ‌వ పంచ‌నామా నివేదిక వ‌చ్చిన త‌ర్వాత పూర్తి వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే రెంజూషా కొంత కాలంగా ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న‌ట్లు.. ఆబాధ‌లు త‌ట్టుకోలేక ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటుంద‌ని కుటుంబ స‌భ్యులు..స్థానికులు అనుకుంటున్నారు. ఆమె మ‌ర‌ణ వార్త‌తో మాలీవుడ్ దిగ్బ్రాంతి వ్య‌క్తం చేసింది.

కొచ్చి నుంచి వచ్చిన రేంజుషా మీనన్ తొలు ఓ మలయాళ టీవీ ఛానెల్‍లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభిం చారు. అటుపై టీవీ సీరియళ్లలో నటించారు. 'స్త్రీ' అనే సీరియల్‍తో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత చాలా సీరియళ్లు.. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. చివరగా 'ఆనందరాగం' సీరియల్‍లో కనిపించారు. 'ఇంటే మతావు'.. 'మిసెస్ హిట్లర్' సహా మరిన్ని టీవీ సీరియళ్లలో మంచి పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. 'సిటీ ఆఫ్ గాడ్'..' బాంబే మార్చ్ వ‌న్ వే 'టికెట్ లాంటి చిత్రాల్లో న‌టించారు.

ఈసినిమాలు ఆమెకి న‌టిగా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. కొత్త అవ‌కాశాల‌కు మంచి మార్గాన్ని వేసాయి. ఇలా వృత్తి ప‌రంగా సంతోషంగా సాగిపోతున్న స‌మ‌యంలోనే మ‌నోజ్ అనే న‌టుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఈనేప‌థ్యంలో ప‌లు సీరియ‌ళ్ల‌ను సొంతంగా నిర్మించారు. వాటిలో లాభ‌న‌ష్టాలు చూసారు. సెలెబ్రిటీల వంటల షో సెలెబ్రిటీ కిచెన్ మ్యాజిక్‍లోనూ పాల్గొన్నారు. రెంజుషా ప్రొఫెషనల్ భరతనాట్యం లోనూ మంచి పేరు సంపాదించారు.


Tags:    

Similar News