రణ్‌వీర్ కామెంట్స్.. ఇడియట్ అంటూ రేణు దేశాయ్ ఫైర్

ఎవరి గొంతుకైతే బలంగా వుందో, ఎవరు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారో వాళ్లే ఫేమస్ అవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి

Update: 2025-02-11 11:21 GMT

ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ ఒక మైక్ లా మారిపోయింది. ఎవరి గొంతుకైతే బలంగా వుందో, ఎవరు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారో వాళ్లే ఫేమస్ అవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక్క సిగ్నల్‌తో ప్రపంచమంతా కనెక్ట్ అయ్యే యుగంలో, కొందరు వైరల్ కావడానికి హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినొద్దనే అలోచన లేకుండా, రెచ్చగొట్టే ప్రశ్నలు వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొంతమందిని అనవసరమైన దారిలో నడిపిస్తోంది.

ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నది యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా వ్యవహారం. ఇతడు ‘ఇండియాస్ గాట్ లాలెంట్’ అనే షోలో పాల్గొని ఓ కంటెస్టెంట్‌ను అసభ్యకరమైన ప్రశ్నతో షాక్‌కు గురి చేశాడు. ‘‘మీ తల్లిదండ్రుల సన్నిహిత రొమాంటిక్ క్షణాలు జీవితాంతం చూస్తావా? లేక ఒక్కసారి కలిసిపోయి ఆపిస్తావా?’’ అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో షోలో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రణ్‌వీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఈ వివాదంపై రేణు దేశాయ్ కూడా స్పందిస్తూ గట్టి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ‘‘మీ పిల్లలను సంయమనం కలిగిన వ్యక్తులుగా పెంచండి. ఇటువంటి ఐడియట్స్ కు దూరంగా ఉండండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పుకొని అసభ్యకరమైన మాటలు మాట్లాడటం నేరం. యూత్ ఇటువంటి వల్గారిటీని అంగీకరించకూడదు’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇక రణ్‌వీర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పినా కూడా విమర్శలు ఆగలేదు. అతని వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగం నుంచి రాజకీయ నేతల వరకు చాలా మంది అతడిపై మండిపడుతున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం కాంట్రవర్సీ కాదు, అది బాధ్యతారాహిత్యం అని అంటున్నారు.

సమాజంలో ఇలాంటి కామెంట్స్ ను పెంచిపోసే వాళ్లను బయట పెట్టడం అవసరం. ఎవరైనా ఫేమస్ కావాలంటే టాలెంట్‌తో రావాలి, ఈ తరహా సంచలనాలతో కాదు. సోషల్ మీడియా ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా, బాధ్యతగా ఉండేలా మారాలని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన నియంత్రణలు అవసరం. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు కూడా ఇటువంటి విషయాల్లో దూకుడుగా స్పందించి, హద్దు దాటి మాట్లాడే కంటెంట్‌ను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News