టైగర్ లో రేణు దేశాయ్ క్యారెక్టర్.. ఆమె ఎవరంటే..
ఈ సినిమాలో నేను చేయడానికి కారణం హేమలత లవణం పాత్ర… ఆ పాత్ర గురించి దర్శకుడు వంశీకృష్ణ చెప్పిన తర్వాత పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. చాలా గొప్పగా అనిపించింది. అలాంటి వ్యక్తిని ఎందుకు కలవలేకపోయానా అనిపించింది.
బద్రి మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రేణు దేశాయ్ మొదటి చిత్రంతోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. దీంతో సినిమాలకి స్వస్తి చెప్పి పవర్ స్టార్ తో సహజీవనంలో చాలా కాలం ఉంది. తరువాత జాని సినిమాలో మళ్ళీ నటించింది. 2009 ఎన్నికలకి ముందు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ వివాహం జరిగింది. కొన్నేళ్ళ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
అప్పటి నుంచి సింగిల్ మదర్ గానే కొడుకు అకిరా నందన్, కూతురు ఆధ్యాని పెంచి పెద్ద చేస్తున్నారు. తరువాత కాలంలో మరాఠీలో ఒక చిత్రానికి రేణు దేశాయ్ దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో ఇప్పుడు మరల ఆమె మ్యాకప్ వేసుకొని నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సామాజివేత్త, నాస్తికురాలు, సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ కనిపిస్తున్నారు. ఈ పాత్రని ఆమె ఎంతో ఇష్టపడి చేసినట్లు తాజాగా మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పేర్కొంది.
ఈ సినిమాలో నేను చేయడానికి కారణం హేమలత లవణం పాత్ర… ఆ పాత్ర గురించి దర్శకుడు వంశీకృష్ణ చెప్పిన తర్వాత పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. చాలా గొప్పగా అనిపించింది. అలాంటి వ్యక్తిని ఎందుకు కలవలేకపోయానా అనిపించింది. 2008లో ఆమె చనిపోయింది. 70వ దశకంలోనే స్త్రీవాదిగా ఆమె మహిళల హక్కుల కోసం పోరాడారు. ఎంతో మంది జీవితాలని ప్రభావితం చేశారు.
నేటితరం మహిళలకి హేమలత లవణం ఒక ఆదర్శం. ఆమె గురించి బ్రతికున్నప్పుడు తెలుసుకుంటే కచ్చితంగా కలిసి ఆమె కాళ్ళపై సాష్టాంగం పడి నమస్కరించేదానిని, హేమలత లవణం గురించి తెలుసుకున్న తర్వాత అలాంటి వ్యక్తిని కలవలేకపోయాననే రిగ్రీట్ ఇప్పటికి ఉంది. హేమలత లవణం మేనకోడలుని కలుసుకొని ఆమె ఎలా ఉండేవారు. ఆలోచనలు, వస్త్రధారణ గురించి అన్ని తెలుసుకున్న.
పెళ్లి అయిన కూడా తెల్లచీర కట్టుకొని ఆమె సమాజంలో తిరిగేవారు. తెలుపు చైతన్యానికి ప్రతీకగా భావించే ఆమె వాటినే ఎక్కువగా ధరించింది. స్టువర్టుపురం దొంగల్లో కూడా మార్పు తీసుకొచ్చిన దీరోదాత్త మహిళగా హేమలత లవణం ఉన్నారు. అలాంటి పాత్రలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.