టైగర్ నాగేశ్వరరావు.. రేణు దేశాయ్ నిజమైన పాత్ర

తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఆమె రియల్ లైఫ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారని టాక్. లవణం హేమలత పాత్రలో ఆమె కనిపించబోతుందంట.

Update: 2023-08-21 04:22 GMT

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న రియల్ లైఫ్ రాబిన్ హుడ్ స్టోరీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో వంశీ కృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రేణు దేశాయ్ కూడా కనిపించబోతోంది.

జానీ సినిమా తర్వాత రేణు దేశాయ్ మరల బిగ్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వలేదు. ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అయ్యి టీవీ డాన్స్ షోలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే సినిమాలలో కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర కోసం వంశీకృష్ణ ఆమెని ఎంపిక చేశారు. అయితే రేణు దేశాయ్ పోషించే పాత్రపై ఎక్కడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఆమె రియల్ లైఫ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారని టాక్. లవణం హేమలత పాత్రలో ఆమె కనిపించబోతుందంట. ఈ పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. దొంగగా మారిన టైగర్ నాగేశ్వరరావులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసే సామాజికవేత్తగా ఆమె చిత్రంలో నటించినట్లు తెలుస్తోంది.

ఆమె ప్రభావంతో టైగర్ ఎలా దొంగతనాలు మానేసి మరల మామూలు జీవితంలోకి వచ్చాడు అనేదికథలో భాగంగా ఉండే ఛాన్స్ ఉందంట. స్టువర్టుపురంలో కుటుంబాల వారిని దొంగతనాలకు దూరం చేయడంతో పాటు వారిపై పోలీసులు పెట్టె అక్రమ కేసుల నుంచి లవణం హేమలత అప్పట్లో పోరాటాలు చేశారు. అలాగే దొంగలతో కూడా మార్పు కోసం ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రియల్ కథలో టైగర్ నాగేశ్వరరావు మారలేదు. మరి సినిమాలో ఎలా చూపిస్తారో చూడాలి.

అలాంటి ఇన్ ఫ్ల్యూయెన్స్ పాత్రలో రేణు దేశాయ్ మూవీస్ లోకి రీఎంట్రీ ఇస్తూ ఉండటం విశేషం. ఈ మూవీ సక్సెస్ అయ్యి, రేణు క్యారెక్టర్ వర్క్ అవుట్ అయితే తరువాత నటిగా మళ్ళీ ఆమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News