రేణుకాస్వామి మ‌ర్మాగం, చెవులు, ద‌వ‌డ కొసేసి దాడి!

తాజాగా రేణుకాస్వామి అత్యంత పై కృరంగా దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. అతిడి మ‌ర్మాంగంతో పాటు, చెవులు, ద‌వ‌డ కోసేసి చిత్ర హింస‌ల‌కు గురిచేసిన‌ట్లు తెలుస్తోంది.

Update: 2024-06-26 12:37 GMT

అభిమాని రేణుకాస్వామి పై అత్యంత‌పాశ‌వికంగా దాడికి తెగ‌బ‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇంత‌వ‌ర‌కూ అత‌డిపై కేవ‌లం దాడి మాత్ర‌మే జ‌రిగింద‌నుకున్నారంతా. కానీ విచార‌ణ‌లో విస్తు పోయేవాలు బ‌య‌ట ప‌డుతు న్నాయి. తాజాగా రేణుకాస్వామి అత్యంత పై కృరంగా దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. అతిడి మ‌ర్మాంగంతో పాటు, చెవులు, ద‌వ‌డ కోసేసి చిత్ర హింస‌ల‌కు గురిచేసిన‌ట్లు తెలుస్తోంది.

అత‌డి మృత‌దేహానికి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో విష‌యం లీకైంది. వాటిని చూడ‌టానికి నెటి జ‌నులు భ‌య ప‌డుతున్నారు. దీంతో మ‌రోసారి నెట్టింట నెటి జ‌నులు తీవ్ర అగ్ర‌హానికి గుర‌వుతున్నారు. అంత‌టి దారుణానికి ఎలా ఒడిగ‌ట్టారంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. న‌రూప రాక్ష‌సుల్లా ద‌ర్శ‌న్ గ్యాంగ్ దాడికి తెగ‌బ‌డిన‌ట్లు మండిప‌డుతున్నారు. రాక్ష‌సులంటూ ఉంటే? అది మీలాగే ఉంటారంటూ నెటి జ‌నుల కోపం క‌ట్ట‌లు తెంచుకుంటుంది.

మ‌నిషి అనే ప‌దానికి అర్దం తెలియ‌నంత దారుణంగా ప్ర‌వ‌ర్తించార‌ని ద‌ర్శ‌న్ అభిమానులు దుయ్య‌బె డుతున్నారు. తెలిసో? తెలియ‌కో త‌ప్పు చేస్తే ఇంత దారుణ‌మైన చ‌ర్య‌ల‌కు దిగిన వారిని క‌ఠినంగా శిక్షించా ల‌ని పోస్టులు పెడుతున్నారు. ఇదంతా స్వ‌యంగా దర్శ‌న్ చేయించాడా? అత‌డు మ‌నుషులు చేసారా? ఏది ఏమైనా ఇలాంటి ఆలోచ‌న అనేది మ‌నిషికి ఉండే ల‌క్ష‌ణం కాద‌ని పూర్తిగా సైకో ప్ర‌వ‌ర్త‌న‌లా ఉంద‌ని మండిప‌డుతున్నారు.

ఇప్ప‌టికే ఈకేసులో అరెస్ట్ అయిన ద‌ర్శ‌న్, ప‌విత్రాగౌడ్ ప‌ర‌ప్ప‌న్ అగ్ర‌హారం జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. వాళ్ల‌తో పాటు మ‌రో 15 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఇంకా దాడిలో ఎవ‌రైనా భాగ‌మయ్యారా? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మ‌రోవైపు ద‌ర్శ‌న్ ని ఎలాగైన బెయిల్ పై బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని అత‌డి లాయ‌ర్ల బృందం కొన్ని రోజులుగా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.

Tags:    

Similar News