ప్రేక్షకులని విసిగిస్తోన్న రీరిలీజ్
వాటిలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ థియేటర్స్ లోకి వచ్చి మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పోకిరి సినిమాతో ఈ రీరిలీజ్ స్టార్ట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమా రీరిలీజ్ చేశారు. ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. తరువాత ఈ సినిమా పవన్ కళ్యాణ్ జల్సా సినిమాని పోటీగా ఫ్యాన్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి కూడా అద్భుతమైన ఆదరణ లభించింది.
పాత సూపర్ హిట్ సినిమాలు అన్ని కూడా రీరిలీజ్ చేస్తున్నారు. ఆరంభంలో ఫ్యాన్స్ ఈ సినిమాలు థియేటర్స్ లో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు. తరువాత ఫ్లాప్ సినిమాలు కూడా రీరిలీజ్ చేయడం మొదలు పెట్టారు. ఆరెంజ్ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ డబ్బింగ్ సినిమాలని కూడా రీరిలీజ్ చేయడం మొదలు పెట్టారు. వాటిలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ థియేటర్స్ లోకి వచ్చి మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
7/G బృందావన కాలనీ మూవీకి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇప్పుడు అదుర్స్ మూవీ కూడా థియేటర్స్ లోకి వస్తోంది. దీని తర్వాత వెంకీ, నువ్వు నాకు నచ్చావ్, శివాజీ సినిమాలు రీరిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అయితే ఆరంభంలో ఉన్నంత హైప్ ఈ రీరిలీజ్ సినిమాలపట్ల ఇప్పుడు లేదని చెప్పాలి. ఓ రకంగా రీరిలీజ్ సినిమాలు ప్రేక్షకులని విసిగిస్తున్నాయి.
ఇప్పటికైనా ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్న వారు వెనక్కి తగ్గి రీరిలీజ్ సినిమాల పరంపరకి బ్రేక్ ఇస్తారా లేదంటే పాత సినిమాలని మరికొంత కాలం ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. ఒక వేళ అలా చేసిన థియేటర్స్ కి సినిమాలు చూసే పరిస్థితి అయితే లేదు.
ఇంకా ఇది కొనసాగించిన నష్టాలు తప్ప లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏదో అకేషనల్ గా పాత హిట్ సినిమాలు రిలీజ్ చేస్తే ఒకే కాని ఈ మధ్య ఇదే ట్రెండ్ గా ప్రతి ఒక్కరు మూవీస్ వరుసగా రీరిలీజ్ చేస్తున్నారు.