టాలీవుడ్ ఇప్పుడు రి రిలీజ్ మీద డిపెండ్ అయిందా?
టాలీవుడ్ లో మొదలైన రీ-రిలీజ్ అయిన ట్రెండ్ దేశమంతా విస్తరిస్తుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
టాలీవుడ్ లో మొదలైన రీ-రిలీజ్ అయిన ట్రెండ్ దేశమంతా విస్తరిస్తుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ లోనూ మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా సీనియర్ హీరోల నుంచి ఆ తర్వాత తరం హీరోల వరకూ అందరి సినిమాలు కూడా ఏదో సందర్భంగా రీ-రిలీజ్ లోనూ మంచి వసూళ్లను సాధించాయి.
ఈ విధానం నచ్చి కోలీవుడ్ కూడా రీ-రిలీజ్ లోకి దూకింది. రజనీకాంత్, కమల్ హాస్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాలు అక్కడా మంచి ఫలితాలు సాధించాయి. ఈ రెండు పరిశ్రమలను చూసి బాలీవుడ్ కూడా అలవాటు చేసుకుంటుంది. ఇటీవలే `లైలా మజ్ను` చిత్రం రీ-రిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించింది. మొదటిసారి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాకి పెట్టిన బడ్జెట్ పూర్తిగా రికవరీ అవ్వలేదు. అయితే రీ-రిలీజ్ తో అప్పటి నష్టాలను తగ్గాయని కోమల్ వెల్లడించారు.
ఇవే వసూళ్లు మిగతా నిర్మాతల్ని రీ-రిలీజ్ వైపు ఉసిగొలుపుతున్నాయి. కొత్త చిత్రాల కొరత, విడుదలైన తాజ చిత్రాలు బాక్సాపీసు వసూళ్లు సాధించలేకపోవడంతో రీ-రిలీజ్ లు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయని బాలీవుడ్ నిర్మాణ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా గుర్తు చేసారు. రీ-రిలీజ్‌లకు ఎటువంటి ప్రమోషన్ ఉండదు. పోస్టర్‌లు టిక్కెట్ బుకింగ్ సైట్‌లలో వచ్చేస్తాయి. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ సినిమాలు పూర్తిగా ఇష్టపడేవారు , కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ప్రేక్షకుల అభిమానంతో నడుస్తాయని` ఆదర్శ్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని దక్షిణాది చిత్ర పరిశ్రమల విశ్లేషకులు శ్రీధర్ పిళ్లై చెప్పారు. అయితే ప్రత్యేకంగా పాత చిత్రాల్ని మళ్లీ థియేటర్లో ఎందుకు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు? ఓటీలో చూడొచ్చు కదా? అన్న సందేహాన్ని నివృతి చేసారు. థియేటర్‌లో సినిమా చూసే అనుభవం ఆన్‌లైన్‌లో చూడటం కంటే చాలా భిన్నంగా ఉంటుంది.
థియేటర్ అనుభవాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. పుణేకి చెందిన 30 ఏళ్ల శ్రుతి జెండే కూడా దీంతో ఏకీభవించారు. `గత ఏడాది నుంచి రీరిలీజ్ లు చూడటం మొదలు పెట్టాను.రీ రిలీజ్‌లో ప్రేక్షకులను ఎగ్జైట్ చేసేది కథ కాదు. సినిమాని ఇష్టపడే ఇతర ప్రేక్షకులతో థియేటర్లో చూసే అనుభవం. ప్రేక్షకులు కొన్ని సన్నివేశాలు లేదా డైలాగ్‌లకు ముందు ప్రతిస్పందించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే తర్వాత సీన్‌లో ఏం జరుగుతుందో? వారికి ముందే తెలుసుకాబట్టి.
`వెంకీ`, `మురారి` సినిమాల రీ రిలీజ్ సమయంలో ప్రేక్షకుల్ని నుంచి ఇది బాగా గమనించాను. 2004లో విడుదలైన నాగార్జున `మాస్` చిత్రం మళ్లీ ఈ వారం థియేటర్లో చూడాలనే ఉత్సాహంతో ఉన్నాను. ఏడాదికి ఒకటి లేదా రెండు రీ-రిలీజ్‌లను చూస్తాను. కొత్త సినిమాలు చూడటానికీ ఎక్కువగా ఇష్టపడతాను` అని అన్నారు.