'సీట్ బెల్ట్ పెట్టుకుని రెడీ మరి! పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు!!'

అయితే పుష్ప-2కు సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి వర్క్ చేశారు.

Update: 2024-12-04 07:01 GMT

మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2 మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా 12 వేల స్క్రీన్స్ కు పైగా వివిధ ఫార్మాట్స్ లో సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ చేపట్టిన మేకర్స్.. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రూ.1000 కోట్ల క్లబ్ లోకి అడుగు పెడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వరల్డ్ వైడ్ గా పుష్ప సీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

అయితే పుష్ప-2కు సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి వర్క్ చేశారు. రీసెంట్ గా ఆయన తన టీమ్‌ తో కలిసి దిగిన ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే. దాని ద్వారా పుష్ప -3 టైటిల్ కూడా రివీల్ అయింది. ఇప్పుడు రసూల్ పూకుట్టి టీమ్ మాట్లాడుతున్న వీడియో ట్రెండ్ అవుతోంది.

అందులో డాల్బీ 7 వెర్షన్ లో స్టాండర్డ్ లెవల్‌ లో పుష్ప 2 సౌండింగ్ వర్క్ చేశామని రసూల్ టీమ్ తెలిపింది. సరిగా చేయని మిక్సింగ్ కారణంగా.. తాము తరచుగా లౌడ్‌ నెస్ ఫిర్యాదులు వింటున్నామని, అయితే ఈసారి హాలీవుడ్ సినిమాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పుష్ప2 కు వర్క్ చేశామని రసూల్ వీడియోలో వివరించారు.

ఆ తర్వాత వీడియోను రసూల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "మీరు రైడ్ కోసం రెడీ చేయండి... సీట్ బెల్ట్ పెట్టుకోండి.. పుష్ప రాజ్ వచేస్తున్నాడు" అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌండింగ్ వేరే లెవెల్ లో ఉన్నట్లు అర్థమవుతుందని, ఓవరాల్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ, రావు రమేష్, ధనుంజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో మెరవనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    

Similar News