మాస్టర్ భరత్ లా బుల్లిరాజు ఫేమస్ అవుతాడా?
ఇప్పుడు రేవంత్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ సంచలనం అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలో రేవంత్ వెంకటేష్ కుమారుడి పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే.
చైల్డ్ ఆర్టిస్ట్ గా భరత్ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. బాల నటుడిగా ఎప్పటికీ గుర్తిండిపోయే పేరు అది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో వైవిథ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. దాదాపు 80కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. చిట్టి నాయుడిగా ఎంతో ఫేమస్ అయ్యాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కొన్ని సినిమాలు చేసాడు. అయితే అదే భరత్ కు పెద్దాయ్యాక అవకాశాలు మాత్రం రాలేదు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ భరత్ ని వినియోగించుకుంది కానీ... పెద్దాయ్యాక నటుడిగా మాత్ర యాక్సెప్ట్ చేయలేదు. చదువులతో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన భరత్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా భరత్ లాగే ఇప్పుడు రేవంత్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ సంచలనం అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలో రేవంత్ వెంకటేష్ కుమారుడి పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే.
చైల్డ్ ఆర్టిస్ట్ గా రేవంత్ కి ఇదే తొలి సినిమా. ఒక్క సినిమాతోనే ఊపేసాడు ఈ బుడ్డొడు. ఆ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అంటే బుల్లి రాజు పాత్రతోనే సాధ్యమైంది. బుల్లి రాజు బూతుపురాణం సినిమాకి బాగా కనెక్ట్ అవ్వడంతోనే సాధ్యమైంది. 10 ఏళ్ల వయసున్న కుర్రాడు అలాంటి బూతులు మాట్లాడితే కనెక్ట్ అవ్వడం అన్నది మానవ నైజం. అదే సినిమాకి కాసుల రూపంలో కలిసి వచ్చింది. దీంతో రేవంత్ కి కొన్నాళ్ల పాటు అవకాశాలకు తిరుగుండదు.
అనీల్ రావిపూడిలా మరింత మంది బుల్లిరాజుకును వాడుకోవాలని చూస్తారు. ఓ ఐదేళ్ల పాటు రేవంత్ కి ఆ ఛాన్స్ ఉంది. ఎదిగే కొద్ది శరీరంలో మార్పులొస్తాయి. అప్పుడు రూపంలో మార్పు వస్తుంది. ఆ మార్పు రానంత వరకూ ఆడియన్స్ ఆ తరహా పాత్రలకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే రేవంత్ ఓ పదిహేను సినిమాలకు సైన్ చేసినట్లు వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అంటే రేవంత్ సంపాదన 10 ఏళ్ల వయసు నుంచే ప్రారంభమైనట్లే.