సల్మాన్ (X) బిష్ణోయ్.. మధ్యలో తలదూర్చిన RGV
ఈ జంతు ప్రేమ ఉచ్ఛస్థితిలో ఉందా లేదా దేవుడు ఒక విచిత్రమైన జోక్ చేస్తున్నాడా? అంటూ సామాజిక మాధ్యమాల్లో రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసారు.
సల్మాన్ ఖాన్ వర్సెస్ లారెన్స్ బిష్ణోయ్ వార్ పరాకాష్టకు చేరుకుంది. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ సల్మాన్ ని మాత్రమే కాదు ముంబై మొత్తాన్ని ఒణికిస్తున్నాడు. సెలబ్రిటీలు ఇప్పుడు గజగజ ఒణికిపోతున్నారు. అతడిని ఆపకపోతే మరో దావూద్ అయ్యేట్టున్నాడు అన్న ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో ఈ ఎపిసోడ్ పై వివాదాస్పద రామ్ గోపాల్ వర్మ పరాచికం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. ఆర్జీవీ ఎక్స్ ఖాతాలో బిష్ణోయ్ గొప్పతనాన్ని ఎంతో గొప్పగా పొగిడారు.
గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఒక లాయర్ ఒక సూపర్ స్టార్‌ని చంపడం ద్వారా జింక మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాడు. ఒక హెచ్చరికగా ఫేస్ బుక్ ద్వారా రిక్రూట్ చేసుకున్న తన 700 మంది గ్యాంగ్‌లో కొందరిని ఆదేశిస్తాడు. అతడు మొదట స్టార్‌కి సన్నిహితుడైన ఒక పెద్ద రాజకీయవేత్తను చంపమని ఆదేశించాడు. అతడు జైలులో ప్రభుత్వ రక్షణలో ఉన్నందున అతడి ప్రతినిధి విదేశాల నుండి మాట్లాడుతున్నందున పోలీసులు ఎవరినీ పట్టుకోలేరు.
ఒక బాలీవుడ్ రచయిత ఇలాంటి కథతో వస్తే వారు నమ్మశక్యం కాని, హాస్యాస్పదమైన కథను రాసినందుకు అతడిని కొట్టారు.... అని అన్నారు. 1998లో జింకను చంపినప్పుడు లారెన్స్ బిష్ణోయ్ కేవలం 5 సంవత్సరాల పిల్లవాడు. బిష్ణోయ్ తన పగను 25 సంవత్సరాలు కొనసాగించాడు. ఇప్పుడు 30 సంవత్సరాల వయస్సులో ఆ జింకను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి సల్మాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని చెప్పాడు. ఈ జంతు ప్రేమ ఉచ్ఛస్థితిలో ఉందా లేదా దేవుడు ఒక విచిత్రమైన జోక్ చేస్తున్నాడా? అంటూ సామాజిక మాధ్యమాల్లో రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసారు.
అన్నట్టు గ్యాంగ్ స్టర్ కథల్ని రాసే ఆర్జీవీని ఇంతగా ఇన్ స్పయిర్ చేస్తున్న ఈ స్టోరీని తనదిగా చేసుకుని సినిమాగా తెరకెక్కించే దమ్ము లేదా? కేవలం ఇలా మాటలతో కాలక్షేపం చేస్తే ఏం ప్రయోజనం? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ జోక్ లోకి తాను నమ్మని దేవుడిని కూడా ఎందుకు లాగాడు? ఇకపోతే తన ఉద్ధేశంలో జైలులో అధికారుల రక్షణలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ నిజమైన హీరోనా? అని నెటిజనం ప్రశ్నిస్తున్నారు.