లైంగిక వేధింపులపై వర్మ మార్క్ సోల్యుషన్ ఇది!
వేధింపైలపై ఎవరి అభిప్రాయాలు వారు పంచుకుంటున్నారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక మాలీవుడ్ సహా దేశ వ్యాప్తంగా సంచలనమైన వేళ...కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణ కేసులో జైల్ రిమాండ్ లో ఉండటం దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. బాధిత మహిళలంతా మీడియా ముందుకొచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు. వాళ్లకు మద్దతుగా చాలా మంది నటీమణులు నిలుస్తున్నారు. వేధింపైలపై ఎవరి అభిప్రాయాలు వారు పంచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సంచలనాల రాంగోపాల్ వర్మ తన మార్క్ వేధింపులపై ఇలా చేస్తే వాటికి ఓ పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఆయన ఏమన్నారంటే? ` సినీ పరిశ్రమలోకి రావాలనుకునే మహిళలు ఆయా డిపార్ట్ మెంట్లకు సంబంధించిన అసోసియేషన్ లో మెంబర్ షిప్ తీసుకోవాలి. కొత్త వారికి అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇక్కడ ఎలా ఉంటుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఏవైనా వేధింపులు ఎదురైతే కమిటీకి ఎలా చెప్పాలి? అనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించాలి.
అప్పుడు వారికి ఇండస్ట్రీ అంటే ఓ అవగాహన వస్తుంది. సమస్య పై ఎలా పోరాటం చేయాలి? అన్నది తడుతుంది. మెంబర్ షిప్ లేనివారిని సినిమాల్లోకి తీసుకోకూడదు. ఈ కండీషన్ కచ్చితంగా పెట్టాలి. మెంబర్ షిప్ ఉంది అంటే? ఇబ్బంది పెడితే అసోసియేష్ కి తెలుస్తుందనే భయం ఉండాలి. అలాంట ప్పుడు అమ్మాయిల్నిమాయం చేయాలనుకునే వారు అదుపులో ఉంటారు.
కొత్తగా వచ్చే వారికి అవగాహన కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. మెంబర్ షిప్ ఉంటే? అమ్మాయిలను ఎక్స్ ప్లాయిడ్ చేయకూడదని నిర్మాతలకు అర్దమవుతుంది. ఈ రకంగా చేస్తే లైంగిక వేధింపులు అడ్డుకునే అవకాశం ఉంటుంది` అని అన్నారు. వర్మ చెప్పింది నూరు శాతం నిజం. ఇప్పటి వరకూ చిత్ర పరిశ్రమలపై ఎన్నోసార్లు లైంగిక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కానీ వాటికి శాశ్వత పరిష్కారం మాత్రం దొరకలేదు. శాశ్వత పరిష్కార కమిటీ వేస్తామని చెప్పడం తప్ప ఇంతవరకూ వేసింది కూడా లేదు. మరి వర్మ సలహాను ఎంత మంది తీసుకుంటారో చూడాలి.