చరణ్ 'పెద్ది' గ్లింప్స్.. ఆర్జీవీ ప్రశంసలే.. కానీ..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.;

Update: 2025-04-09 09:43 GMT
చరణ్ పెద్ది గ్లింప్స్.. ఆర్జీవీ ప్రశంసలే.. కానీ..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆడియన్స్ లో ఇప్పటికే పెద్దిపై భారీ అంచనాలు ఉండగా.. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ వాటిని ఓ రేంజ్ లో పెంచేసిందని చెప్పాలి.

గ్లింప్స్ రిలీజ్ అయ్యాక.. అటు చరణ్ పై.. ఇటు బుచ్చిబాబుపై వేరే లెవెల్ లో ప్రశంసలు కురిశాయి. బుచ్చిబాబు మేకింగ్.. చరణ్ యాక్టింగ్.. అదిరిపోయాయని అంతా కొనియాడారు. ఒక్కో షాట్.. సూపర్ గా ఉందని.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అప్పుడే అంచనా వేసేశారు. అలా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది పెద్ది గ్లింప్స్.

అయితే పెద్ది గ్లింప్స్ రిలీజ్ అయ్యాక అనేక మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రెస్పాండ్ అయ్యారు. "పెద్ది నిజమైన గేమ్ ఛేంజర్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రామ్ చరణ్ గ్లోబల్ కూడా యూనివర్సల్ గా కనిపిస్తున్నారు" అని తెలిపారు.

"రాజమౌళి తర్వాత చరణ్ సామర్థ్యాన్ని అర్థం చేసుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు. మూవీ ట్రిపుల్ సిక్సర్ గా హిట్ గా మారుతుంది" అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆర్జీవీ ట్వీట్ చూసి నెటిజన్లు ఒక్కసారి షాకయ్యారు. ఇప్పటికే మెగా హీరోల సినిమాలను అనేక సార్లు ట్రోల్స్ చేసిన ఆయన.. ఈసారి పొగడడంతో నెటిజన్లు డిస్కషన్ స్టార్ట్ చేశారు.

కానీ అవి ప్రశంసలు కావని.. మరోసారి ఆయన ట్రోలింగ్ చేశారని ఇప్పుడు నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ప్రశంసల పేరుతో ట్రోలింగ్ ట్వీట్ పెట్టారని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ అియన విషయం తెలిసిందే. అందుకే ఆ సినిమా పేరును ఉపయోగించి ట్రోల్ చేశారని చెబుతున్నారు.

అదే సమయంలో బుచ్చి బాబుకు మంచి టాలెంట్ ఉన్నా.. రాజమౌళితో పోల్చడం ఎటకారంలా అనిపిస్తుందని అంటున్నారు. క్లియర్ గా ట్రోల్ అని తెలుస్తుందని చెబుతున్నారు. దీంతో ఆర్జీవీ మళ్లీ ఎప్పటిలానే ట్రోల్ చేశారని, అవేం ప్రశంసలు కావని తేల్చి చెప్పేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ విషయంలో ఆయన పెట్టిన పోస్ట్ ను గుర్తు చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫుల్ ఫైర్ అవుతున్నారు!

Tags:    

Similar News