రాజ్ తరుణ్ -లావణ్య వివాదంపై వర్మ సంచలన వ్యాఖ్యలు!
అయితే ఇందులో పూర్తిగా వర్మ రాజ్ తరుణ్ కే మద్దతుగా నిలిచారు. ఆయన ఏమంటున్నాడంటే?'రాజ్ నాతో 11 ఏళ్లు సహజీవనం చేసాడని, అతను నాకు కావాలని లావణ్య అంటోంది.
రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం కొన్ని రోజులుగా నెట్టింట రచ్చ ఏ రేంజ్ లో జరుగుతోందో తెలిసిందే. మీడియా సమక్షంలో ఎవరి వివరణ వాళ్లు ఇచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. దీనిపై ఛానల్స్ లో డిబేట్టు నడుస్తున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీన్ లో కి సంచలనాల రాంగో పాల్ వర్మ ఎంటర్ అయ్యారు. ఇన్ని రోజుల పాటు ఇద్దర్నీ వర్మ స్డడీ చేసి ఫైనల్ గా తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నాడు.
అయితే ఇందులో పూర్తిగా వర్మ రాజ్ తరుణ్ కే మద్దతుగా నిలిచారు. ఆయన ఏమంటున్నాడంటే?'రాజ్ నాతో 11 ఏళ్లు సహజీవనం చేసాడని, అతను నాకు కావాలని లావణ్య అంటోంది. రాజ్ మాత్రమే కావాలంటే అది చాక్లెట్ మాత్రమే కాదు కదా. పెళ్లి చేసుకుని 20-30 ఏళ్లు కాపురం చేసిన తర్వాతా విడిపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది సహజీవినం చేసి విడిపోవడం అన్నది పాయింట్ కాదు.
కలిసి కాపురం చేసే వాళ్లకి ఆడియో రికార్డింగ్ చేయాలనే ఆలోచన రాదు. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్లకే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆడియో క్లిప్స్ లీక్ చేయడం అన్నది క్రిమినల్ మెంటాల్టీని సూచిస్తుంది. ఇక వీరిద్దరు కలిసి ఉండటం అన్నది అసంభవం. రాజ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబు తుంది. కానీ చివరకు ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందనిపిస్తుంది.
ఇంతకు ముందే రాజ్ కొంత డబ్బు ఇచ్చాడని స్వయంగా తానే అంటుంది. దీంతో ఇది కోర్టు లోపల అవుతుందా? బయట అవుతుందా? అన్నది తెలియదు. కానీ కలిసి ఉండటం మాత్రం జరగదు. ప్రస్తుతం మీడియాలో ఇదో వెబ్ సిరీస్ గామారిపోయింది' అని వర్మ తన అభిప్రాయం పంచుకున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ కి బెయిల్ కూడా వచ్చేసింది. పని మనుషుల ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఇకపై దీని మీద పెద్దచర్చ ఉండకోవచ్చు అని వర్మ అంటున్నారు.