RGV ఫ్యాన్: మావా ముఖానికి అండర్వేర్ వేసుకున్నావ్?
మోడల్ (మగువ) అండర్ వేర్ ధరించిన ఒక బోల్డ్ ఫోటో ముందు తన ముఖాన్ని ఉంచి ఫోటో దిగిన ఆర్జీవీ
RGV ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. చాలా కాలానికి నేను మారుతున్నాను! అంటూ 'ఓపెన్ హైమర్' సినిమా చూసొచ్చాక అతడు చెప్పిన డైలాగ్ అభిమానుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆర్జీవీ ఇక మారుతాడు. అతడి నుంచి మళ్లీ సంచలన సినిమాలను ఆశించవచ్చు అంటూ అభిమానులు సంబరపడ్డారు.
నోలాన్ లోని డెప్త్ ని అర్థం చేసుకోవడానికి మనకు వందేళ్లు పడుతుంది అన్న ఆర్జీవీ తనలో ఉన్న శక్తి యుక్తుల గురించి తిరిగి అన్వేషించడం మొదలు పెట్టాడని అంతా భావించారు. కానీ ఇంతలోనే ఊహించని పిడుగు..
నోలన్ లా ఆర్జీవీ ఎందుకని డిగ్నిఫైడ్ గా ఉండడు? ఎందుకిలా ఛీప్ గా ప్రవర్తిస్తూ దొరికిపోతాడు! అన్న ఆవేదన కూడా అభిమానుల్లో ఎంతో కాలంగా ఉంది. ఇప్పుడు తన ఆలోచనల స్థాయి ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తూ ఆర్జీవీ పోస్ట్ చేసిన ఓ ఫోటో అభిమానుల్లో చర్చకు తావిచ్చింది.
మోడల్ (మగువ) అండర్ వేర్ ధరించిన ఒక బోల్డ్ ఫోటో ముందు తన ముఖాన్ని ఉంచి ఫోటో దిగిన ఆర్జీవీ దానిని ఇన్ స్టాలో షేర్ చేసి 'The POINT of life is Life's POINT (జీవితం యొక్క పాయింట్ లైఫ్ పాయింట్) అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ ఫోటోగ్రాఫ్ చూడగానే అభిమానుల నుంచి అంతే వేగంగా స్పందనలు దూసుకొచ్చాయ్. RGV ..సైకో సెక్సాలజిస్ట్! అంటూ ఒక మహిళా అభిమాని వర్ణించింది. 'పిచ్చే దేఖూ పిచీ' అంటూ మరొక అభిమాని స్మైల్ ఈమోజీలను షేర్ చేశాడు. "మావా ముఖానికి అండర్వేర్ వేసుకున్నావ్?" అంటూ ఇంకో అభిమాని చిలిపిదనం ప్రదర్శించాడు. కొంటె ఆర్జీవీ అంటూ ఒకరు.. "ఎంత చౌకగా అయిపోయావు నువ్వు !! ధిక్కరిస్తే మీ తల్లి చాలా బాధ పడతారు !!! నువ్వూ.. అదే ప్రదేశం నుండి వచ్చాడు.. "అంటూ మరొక అభిమాని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.
ఎన్నెన్నో సెల్ఫీ లు చూసినా ఇలాంటి సెల్ఫీ నేను ఎక్కడా చూడలే సామీ.. అంటూ ఇంకో అభిమాని వ్యాఖ్యను జోడించాడు. ఎన్ని సార్లు కొట్టినా చావని పామురా నువ్! అంటూ ఒక అభిమాని.. "అవును ...జీవన రంధ్రమే జీవిత రంధ్రం" అంటూ మరొక అభిమాని రాసారు.
మనం ఫోటో దిగడం ఇంపార్టెంట్ కాదు.. మనకి పాయింట్ ముఖ్యం బిగులూ.. అని వేరొకరు వ్యాఖ్యను జోడించారు. ఆర్జీవీ ఇకనైనా ఈ వేషాలు ఆపి మంచి సినిమాలు తీయ్ అంటూ కొందరు సలహాలిచ్చారు. మరి ఆర్జీవీ ఇప్పటికైనా మారతాడంటారా?