రైడ్ 2.. బచ్చన్ సాబ్ ఇది విన్నారా?

మొదట అక్కినేని నాగార్జునతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాలని ప్లాన్ చేసినా, అది వర్కవుట్ కాలేదు.

Update: 2024-09-12 13:54 GMT

మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ టైమ్ లో సుమతో జరిగిన ఇంటర్వ్యూలో రవితేజ ఒక మాట అన్నారు. మిస్టర్ బచ్చన్ ను రైడ్ హీరో అజయ్ దేవగన్ చూస్తే ఆశ్చర్యపోతారు అని అన్నాడు. అంతే కాకుండా దీన్ని మళ్ళీ రీమేక్ చేసినా చేస్తారు అని మరోవైపు సుమ కూడా ఓ కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన క్లిప్ గట్టిగానే వైరల్ అయ్యింది.

ఇక ఇప్పుడు హఠాత్తుగా రైడ్ 2 హాట్ టాపిక్ గా మారింది. అసలైతే మొదట ఈ ‘రైడ్’ను రీమేక్ చేయడానికి కొన్నేళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొదట అక్కినేని నాగార్జునతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాలని ప్లాన్ చేసినా, అది వర్కవుట్ కాలేదు. తరువాత రవితేజ హీరోగా స్టార్ట్ అయ్యింది. ‘మిస్టర్ బచ్చన్’ పేరుతో ఈ రీమేక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ అంచనాలు నెలకొల్పింది.

‘గబ్బర్ సింగ్’, ‘గద్దలకొండ గణేష్’ లాంటి రీమేక్ లతో హరీష్ శంకర్ అందించిన విజయం నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ప్రేక్షకులు ఆశించారు. అయితే, ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. రవితేజ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఫలితం రవితేజ, హరీష్ శంకర్‌తో పాటు నిర్మాతలకూ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నష్టాలు అధికంగా ఉండడంతో రవితేజ, హరీష్ శంకర్ తమ పారితోషకాల్లో కొంత వెనక్కి ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈ సినిమా విఫలమవ్వడం వల్ల రీమేక్ సినిమాలపై ఆశలు తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా, హిందీలో ‘రైడ్’ సీక్వెల్‌గా ‘రైడ్-2’ రూపొందుతోంది. ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. మొదటి భాగంలో అజయ్ దేవగణ్ అమేయ్ పాత్రలో మంచి నటన కనబరిచాడు. ‘రైడ్-2’లో కూడా అదే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సీక్వెల్‌లో రితీశ్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ వంటి కొత్త నటులు కూడా నటిస్తున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా మొదటి భాగానికి దర్శకత్వం వహించినట్లు, ఈ సీక్వెల్‌ను కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక మన తెలుగు నెటిజన్లు ఈ అనౌన్స్‌మెంట్ తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ టీంపై డిఫరెంట్ గా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా, రవితేజ, హరీష్ శంకర్ గతంలో ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్ల సమయంలో అజయ్ దేవగణ్‌ టీమ్ మా సినిమాను చూసి మళ్లీ రీమేక్ చేస్తారేమో అనేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నెటిజన్లు ఆ వీడియోను తీసుకొచ్చి, ‘రైడ్-2’ అనేది ‘మిస్టర్ బచ్చన్’ కంటే ఇన్‌స్పైర్ అయ్యిందేమో అంటూ మరొక విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్ కొట్టిన దెబ్బకు రీమేక్ సినిమాలపై ఇప్పట్లో మన హీరోలు ఆసక్తి చూపకపోవచ్చు.

Tags:    

Similar News