అక్క‌డ బ్రేక్ ఇచ్చి హైద‌రాబాద్ లో బిజీ అయ్యాడా!

అయితే జైహ‌నుమాన్ ఆన్ సెట్స్ లో ఉన్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే `జై హ‌నుమాన్` షూటింగ్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం.

Update: 2025-01-29 10:57 GMT

యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ యూనివ‌ర్శ్ నుంచి `జై హ‌నుమాన్` రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హ‌నుమాన్ గా క‌న్న‌డ న‌టుడు రిష‌బ్ శెట్టి న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే మంచి బ‌జ్ క్రియేట్ అయింది. అయితే కొంత కాలంగా ఈ సినిమా అప్ డేట్ మ‌ళ్లీ తెర‌పైకి రాలేదు. ప్ర‌శాంత్ వ‌ర్మ వేర్వేరు స్టోరీల‌తో బిజీగా ఉండ‌టం..మ‌ధ్య‌లో బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ బాధ్య‌త‌లు కూడా అత‌డిపై పెట్ట‌డంతో `జైహ నుమాన్` విష‌యాలేవి బ‌య‌ట‌కు రాలేదు.

మ‌రోవైపు ప్ర‌శాంత్ వ‌ర్మ కాచిగూడ లో హాలీవుడ్ రేంజ్ లో సొంతంగా సినిమా ఆఫీస్ నిర్మాణం కూడా మొద‌లు పెట్ట‌డంతో సినిమా అప్ డేట్స్ హైడ్ అయ్యాయి. అయితే జైహ‌నుమాన్ ఆన్ సెట్స్ లో ఉన్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే `జై హ‌నుమాన్` షూటింగ్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఇందులో ప్ర‌ధాన పాత్ర ధారులంతా పాల్గొంటున్నారట‌. దీనిలో భాగంగా రిష‌బ్ శెట్టి కూడా షూటింగ్ కి హాజ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారట‌. సినిమా షూటింగ్ కి కూడా ఎక్కువ‌గానే స‌మ‌యం ప‌డుతుందట‌. స్క్రిప్ట్ బ‌లంగా ఉండ‌టంతో పాటు పాత్ర‌లు కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతో షూటింగ్ అనుకున్న స‌మ‌యానికి పూర్తవ్వ‌క‌పోవ‌చ్చు అనే మాట వినిపిస్తుంది. ముందుగా రిష‌బ్ శెట్టి పోర్ష‌న్ ముగించాల‌ని ప్ర‌శాంత్ వేగంగా షూట్ చేస్తున్నాడట‌. రిష‌బ్ శెట్టి ఈ సినిమాతో పాటు కాంతార -2లో కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమాకు తాను ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హిస్తున్నాడు. అయితే జైహ‌నుమాన్ షూటింగ్ నేప‌థ్యంలో తాత్కాలికంగా కాంతార‌-2 షూటింగ్ కి బ్రేక్ వేసిన‌ట్లు తెలుస్తోంది. కాంతార -2 కోసం ఒకేసారి రెండు ప‌నులు చేయాలి కాబ‌ట్టి అంత రిస్క్ తీసుకోకుండా ముందుగా ప్ర‌శాంత్ వ‌ర్మ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News