మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశా

కాంతార 1 సినిమా తర్వాత వెంటనే ఆయన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో నటించబోతున్నాడు.

Update: 2024-12-06 14:30 GMT

కన్నడ మూవీ 'కాంతార'తో పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన హీరో రిషబ్‌ శెట్టి. ప్రస్తుతం కాంతారకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్‌ 1 సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. కాంతార 1 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కాంతారతో పాటు రిషబ్‌ శెట్టి మరో రెండు అతి భారీ సినిమాలకు కమిట్ కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ఆయన సినీ వర్గాల దృష్టిని ఆకర్షించారు. ఇండియా వ్యాప్తంగా ఆయన నటించబోతున్న సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా ఆయన ఎంపిక ఉంది.

కాంతార 1 సినిమా తర్వాత వెంటనే ఆయన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో నటించబోతున్నాడు. హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందబోతున్న జై హనుమాన్ సినిమాలో రిషబ్‌ శెట్టిని ఆంజనేయుడిగా చూడబోతున్నాం. ఒక స్టార్‌ హీరో హనుమాన్‌ పాత్రలో కనిపించబోవడం ఇదే ప్రథమం. కనుక జై హనుమాన్‌ సినిమా దేశ వ్యాప్తంగా చాలా పాజిటివ్‌ క్రేజ్ ను సొంతం చేసుకుంది. హనుమాన్ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో జై హనుమాన్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జై హనుమాన్‌ను రిషబ్‌ శెట్టితో రూపొందిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి.

జై హనుమాన్ సినిమాకు ఓకే చెప్పి సర్‌ప్రైజ్ చేసిన రిషబ్‌ శెట్టి తాజాగా చత్రపతి శివాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందబోతున్న సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారు. ఇటీవలే శివాజీ మహారాజ్ లుక్‌లో రిషబ్‌ శెట్టిని చూసి మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు షాక్‌ అయ్యారు. చత్రపతి శివాజీ మహారాజ్ పాత్రకు ఓకే చెప్పడంపై రిషబ్‌ శెట్టి ఇటీవల ఒక ఇంగ్లీష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో దక్కిన అతి పెద్ద అవకాశం, అరుదైన అవకాశంగా శివాజీ మహారాజ్ పాత్రను చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

రిషబ్‌ శెట్టి ఇంకా మాట్లాడుతూ... శివాజీ మహారాజ్‌కి నేను అభిమానిని. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పకుండా ఎలా ఉంటాను. క్షణం కూడా ఆలోచించకుండా సినిమాను చేసేందుకు ఓకే చెప్పాను. శివాజీ వంటి గొప్ప వ్యక్తుల జీవితాల గురించి ఈ తరం వారికి చెప్పాలంటే ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది అని భావించాను. అందుకే సినిమాకు ఒప్పుకోవడంకు కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పాను అన్నాడు. 'ది ఫ్రైడ్‌ ఆఫ్‌ భారత్‌ : ఛత్రపతి శివాజీ మహారాజ్‌' టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సందీప్‌ సింగ్ దర్శకత్వం వహించబోతున్నారు.

Tags:    

Similar News