‘ఛావా’ వేవ్ లో ఛత్రపతి...రిషబ్ శెట్టి కొట్టాడు జాక్ పాట్!
`కాంతార`తో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తనని తానే పాన్ ఇండియా స్టార్ గా తీర్చిదిద్దుకున్నాడు. ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్ ని కూడా స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.
`కాంతార`తో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తనని తానే పాన్ ఇండియా స్టార్ గా తీర్చిదిద్దుకున్నాడు. ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్ ని కూడా స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అతడికి తోడు హోంబలే ఫిల్మ్స్ ఉండటంతో చిత్రాన్ని పాన్ ఇండియాలో భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో `హనుమాన్` సీక్వెల్ గా తెరకెక్కుతోన్న `జై హనుమాన్` లో హనుమాన్ పాత్రకు ఎంపిక అవ్వడం అన్నది మరో విశేషం.
ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య వస్తోన్న మరో చిత్రం ఇది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే రిషబ్ శెట్టి రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. అదీ ఆషామాషీ కథతో కాదు. ఏకంగా ఛత్రపతి శివాజీ బయోపిక్ తోనే అక్కడ లాంచ్ అవ్వడం అన్నది మరో విశేషం.
తాజాగా నేడు శివాజీ మహారాజ్ జయంత్రి సందర్భంగా ఫస్టు లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఛత్రపతి శివాజీ గెటప్ లో ఒదిగిపోయాడు. చేతిలో పదునైనా తల్వార్, ఆహార్యం, కాస్ట్యూమ్స్, గుబురు గెడ్డం...తలపై రౌండ్ తలపాగా ప్రతీది శివాజీని తలపిస్తుంది. సరిగ్గా `ఛావా` రిలీజ్ అయి సక్సెస్ అయిన సందర్భంలో శివాజీ బయోపిక్ కూడా రావడం రిషబ్ శెట్టి చిత్రానికి మరింత కలిసొస్తుంది. శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ యోధుడిగా చూసిన ప్రేక్షకులు ఛత్రపతి వీరత్వం కూడా చూసే అవకాశం వెంట వెంటనే రావడం మరో గొప్ప విషయమనే చెప్పాలి.
ప్రస్తుతం శివాజీలుక్ తో కూడిన రిషబ్ శెట్టి పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. `ఛావా` వేవ్ లో పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఛత్రపతి సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. శివాజీ మహారాజ్ జీవితంపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ పాన్-ఇండియన్ లో ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఈసారి మాత్రం దర్శకుడు సందీప్ సింగ్ ఛత్రపతిని పాన్ ఇండియాలో నే రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 21, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది.