యానిమల్ డైరెక్టర్ తో కాంతారా స్టార్..?

ఈ క్రమంలో రానా రిషబ్ శెట్టి ఇంటికి వెళ్లి మరీ అక్కడ తనతో స్పెషల్ చిట్ చాట్ చేశాడు.

Update: 2024-12-21 07:51 GMT

కాంతారాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న యాక్టర్ రిషబ్ శెట్టి ఆ సినిమాతో సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న రిషబ్ శెట్టి నెక్స్ట్ కాంతారా ప్రీక్వెల్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. ఇక లేటెస్ట్ గా రిషబ్ శెట్టి రానా దగ్గుబాటి షోలో పాల్గొన్నాడు. ఎవరైనా స్పెషల్ ఇంటర్వ్యూ అంటే స్టూడియోలో చేస్తారు. కానీ అన్ని ఇంటర్వ్యూలకు భిన్నంగా సెలబ్రిటీస్ వారి సొంత ప్లేస్ లో ఇంటర్వ్యూ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నాడు రానా దగ్గుబాటి.

ఈ క్రమంలో రానా రిషబ్ శెట్టి ఇంటికి వెళ్లి మరీ అక్కడ తనతో స్పెషల్ చిట్ చాట్ చేశాడు. రిషబ్ శెట్టి జీవన శైలి. సినిమాల ఎంపిక.. ఇంకా పర్సనల్ లైఫ్ ఇలా అన్ని విషయాల గురించి ఈ స్పెషల్ చిట్ చాట్ లో ప్రస్తావించారు. ఐతే ప్రస్తుతం ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఉందని రానా రిషబ్ శెట్టిని ప్రశ్న అడిగాడు. దానికి సమాధానంగా రిషబ్ శెట్టి తనకు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉందని అన్నాడు.

అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో సందీప్ వంగ సెన్సేషన్ సృష్టించాడు. సందీప్ వంగ సినిమాలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో అదే రేంజ్ లో విమర్శలు అందుకుంటాయి. ఐతే వాటిని అతను పట్టించుకోడు. అంతే రిషబ్ శెట్టి కూడా సందీప్ వంగ లాగా ఎవరు ఆలోచించరని అన్నాడు. అందుకే ఆయనతో సినిమా చేయాలని ఉందని. అతను తీసే ఏ సినిమాలో అయినా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నాడు రిషబ్ శెట్టి. రిషబ్ లాంటి స్టార్ ఇలా ఓపెన్ స్టేట్మ్నెట్ ఇవ్వడం డైరెక్టర్ గా సందీప్ రెడ్డి రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.

రిషబ్ శెట్టి కూడా ఊరకనే అలా ఒక మాట అనేద్దాం అన్నట్టు చెప్పే వ్యక్తి కాదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ సినిమాల విషయంలో సందీప్ తీసుకున్న స్టాండ్ అతను టేకింగ్ ఇవన్ని నచ్చి రిషబ్ అలా చెప్పాడని చెప్పొచ్చు. మిగతా దర్శకులంతా రిషబ్ ని ఒప్పించాలంటే కష్టపడాలేమో కానీ సందీప్ మాత్రం ఆల్రెడీ రిషబ్ మనసు గెలిచేశాడు. మరి రిషబ్ ఎలాగు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి ప్రభాస్ స్పిరిట్ లో అతన్ని ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందేమో చూడాలి.

Tags:    

Similar News