పింక్ టైట్ లో రితికా సింగ్ పేంపరింగ్!
బ్లాక్ స్పోర్స్ట్ ధరించి..ఆ పై గులాబీ రంగు స్కిన్ టైట్ దుస్తుల్లో అందాల న్నింటిని ఫోకస్ చేసింది. వార్మప్ చేస్తోన్న ఓ ఫోజుని ఇలా నెట్టింట వదిలింది.
'గురు' బ్యూటీ రితికా సింగ్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. టెంప్టింగ్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. మిగతా భామలకంటే సమ్ థింగ్ స్పెషల్ గా డిఫరెంట్ గా ఫోకస్ అవ్వాలని ట్రై చేస్తుంటుంది. బేసిక్ గామార్షల్ ఆర్స్ట్ ట్రైన్డ్ బ్యూటీ కావడంతో ఎక్కువగా జిమ్ ఫోటోల్ని షేర్ చేస్తుం టుంది. అందులోనే కొత్తదనాన్ని వెతుకుతుంది. ఈ క్రమంలో వైవిథ్యంగా ఇన్ స్టాలో కిక్కిచ్చేలా ప్లాన్ చేసుకుంటుంది.
రంగు రంగుల స్కిన్ టైట్ దుస్తుల్లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. తాజాగా అమ్మడు పింక్ వర్ణం టైట్ దుస్తుల్లో సెగలు పుట్టిస్తోన్న ఓ ఫోటో అంతర్జాలంలోకి వదిలింది. ఇదిగో ఇక్కడిలా రూమ్ లో ముందుగా ముస్తాబైన ఫోటోని షేర్ చేసింది. బ్లాక్ స్పోర్స్ట్ ధరించి..ఆ పై గులాబీ రంగు స్కిన్ టైట్ దుస్తుల్లో అందాల న్నింటిని ఫోకస్ చేసింది. వార్మప్ చేస్తోన్న ఓ ఫోజుని ఇలా నెట్టింట వదిలింది.
రెండుచేతులు సగం చాచి ఓ చేతిలో ఐస్ క్రీమ్..మరో చేతిలో పుల్ల తో కనిపిస్తుంది...కుడి కాలు పైకెత్తి చూసారా? నా వార్మప్ స్పెషాల్టీ అంటూ చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
దీంతో ఫాలోవర్ల కామెంట్లకు తిరుగు లేకుండా పోతుంది. ఇక ఈ బ్యూటీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవలే నటించిన 'కింగ్ ఆఫ్ కొత్త' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మాలీవుడ్ సినిమా అయినా అనువాద రూపంలో తెలుగులోనూ రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలమైంది.
తాజాగా ఇటీవలే తలైవార్ 170వ ప్రతిష్టాత్మక చిత్రంలో ఛాన్స్ అందుకుంది. ఇందులో రజనీకాంత్ తో పాటు టాప్ స్టార్లు కూడా భాగం అవుతున్నారు. అలాంటి ప్రాజెక్ట్ లో రితిక ఛాన్స్ అందుకోవడంతో మరోసారి అమ్మడి పేరు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఛాన్స్ ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ రితిక ట్యాలెంట్ పెర్మార్మర్ అని తొలి సినిమాతోనే రుజువు చేసుకుంది.