జిమ్ లో బాక్సింగ్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్

తాజాగా వర్కౌట్స్ అయ్యాక దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది రితికా. జిమ్ లో కసరత్తులు చేశాక.. దిగిన మిర్రర్ సెల్ఫీలు షేర్ చేసింది.

Update: 2024-09-14 04:43 GMT

కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌ ‌లో తన సత్తా ఏంటో చూపించి.. సినీ ఇండస్ట్రీలోకి రితికా సింగ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుధా కొంగర తెరకెక్కించిన సాలా ఖదూస్ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అమ్మడు.. ఆ సినిమాలో బాక్సర్ గా నటించి అందరినీ మెప్పించింది. మాధవన్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని తమిళంలో ఇరుది సుట్రు మూవీతో రీమేక్ చేశారు. కోలీవుడ్ లో కూడా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

 

తెలుగుతో అదే సినిమాను సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా సుధా కొంగర రీమేక్ చేయగా.. అందులో కూడా రితికానే నటించింది. తెలుగు ఆడియన్స్ కు కూడా ఆ మూవీ బాగా నచ్చేసింది. అలా ఒక్క సినిమాతో మూడు ఇండస్ట్రీల్లో అడుగుపెట్టి.. సూపర్ హిట్లను అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగు కంటే ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించింది. ఇప్పుడు నటిస్తోంది కూడా.

 

అయితే గురు మూవీ తర్వాత తెలుగులో నీవెవరో సినిమాలో రితికా నటించగా.. ఆ చిత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తెలుగు వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ లో యాక్ట్ చేసింది. సినిమా డైరెక్ట‌ర్ గా మారాలని కలలు గనే రోల్ లో కనిపించింది. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టియాన్ సినిమా చేస్తోంది. దీంతోపాటు మరిన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది అమ్మడు.

కెరీర్ పరంగా ఎంత బిజీగా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. చీరల్లో, పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోస్తుంటుంది. క్లాసీగా కనిపిస్తూనే ఒక్కసారిగా నెట్టింట సెగలు పుట్టిస్తుంటుంది. తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లను మాయ చేస్తుంటుంది. ఫుల్ హెవీగా చేస్తున్న పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అయితే అమ్మడు వర్కౌట్స్ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటారు.

తాజాగా వర్కౌట్స్ అయ్యాక దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది రితికా. జిమ్ లో కసరత్తులు చేశాక.. దిగిన మిర్రర్ సెల్ఫీలు షేర్ చేసింది. జిమ్ వేర్ లో ఉన్న అమ్మడు.. హెయిర్ లీవ్ చేసుకుని హీట్ పుట్టించే విధంగా చూస్తోంది. తన చూపులతోనే ఫిదా చేస్తోంది. ప్రస్తుతం రితికా పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. రితికా ఫోటోస్ సూపర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి పిక్స్ లో అయినా రితికా అందమే వేరు అని చెబుతున్నారు.

Tags:    

Similar News