అలాంటి సీన్స్ కు కూడా రెడీ అంటున్న రీతూ వ‌ర్మ‌

రీతూకి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఆమె క్లీన్ ఇమేజ్ ఉన్న పాత్ర‌లే చేస్తూ వ‌స్తుంది. ప్ర‌స్తుతం రీతూ న‌టించిన మ‌జాకా సినిమా ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Update: 2025-02-23 13:00 GMT

కెరీర్ స్టార్టింగ్ నుంచి క్లీన్ ఇమేజ్ తో ముందుకు కొన‌సాగుతుంది తెలుగ‌మ్మాయి రీతూ వ‌ర్మ‌. ఇప్ప‌టివ‌ర‌కు తాను ఎలాంటి అస‌భ్య‌క‌ర సీన్స్ లోనూ న‌టించింది లేదు. గ్లామ‌ర్ షో కూడా పెద్ద‌గా చేయ‌లేదు. కానీ అన్ని సంద‌ర్భాల్లో అలాంటి ఇమేజ్ ప‌నికి రాద‌ని రీతూకి అర్థ‌మైంది. రీతూ ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌క‌పోవ‌డంతో ఆమెకు పెద్ద ఛాన్సులు రావ‌డం లేదు.

రీతూకి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఆమె క్లీన్ ఇమేజ్ ఉన్న పాత్ర‌లే చేస్తూ వ‌స్తుంది. ప్ర‌స్తుతం రీతూ న‌టించిన మ‌జాకా సినిమా ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో సందీప్ కిష‌న్ రీతూ వ‌ర్మ‌కు ముద్దులు పెట్టాడు. దీంతో ఆ వీడియో ఒక్క‌సారిగా వైర‌లైపోయింది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రీతూ ఆ వీడియోపై రెస్పాండ్ అయింది.

సందీప్ త‌న‌కు ముద్దులు పెట్టిన వీడియో సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగ‌మ‌ని, అయినా అలాంటి స‌న్నివేశాలు చేయ‌డానికి తానేమీ వ్య‌తిరేకం కాద‌ని, క‌థ డిమాండ్ చేస్తే హ‌గ్, కిస్ సీన్స్ కూడా చేస్తాన‌ని చెప్తోంది రీతూ. రీతూ చేసిన ఈ కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో పాటూ గ‌తేడాది త‌న నుంచి వ‌చ్చిన స్వాగ్ సినిమా గురించి రీతూ మాట్లాడింది.

స్వాగ్ సినిమా చేస్తున్న‌ప్పుడే అది అంద‌రికీ న‌చ్చే జాన‌ర్ కాద‌ని, అంద‌రినీ మెప్పించ‌లేద‌ని అనుకున్నామ‌ని, ఆ సినిమాలోని డెప్త్ చాలా మంది అర్థం చేసుకోలేర‌ని అప్పుడే తాను అనుకున్న‌ట్టు చెప్పిన రీతూ, సినిమా రిజ‌ల్ట్ విష‌యంలో త‌న‌కేం బాధ‌గా అనిపించ‌లేద‌ని, త‌న వ‌ర‌కు మాత్రం న‌టిగా ఆ సినిమా మంచి సంతృప్తినిచ్చిన‌ట్టు తెలిపింది.

పెళ్లి చూపులు సినిమా త‌న‌కెంతో స్పెష‌ల్ అని, ఫ్రెండ్స్ అంతా క‌లిసి చిన్న బ‌డ్జెట్ లో చేసిన సినిమా అని, దాని రిజ‌ల్ట్ ఎలా ఉంటుంద‌నేది ముందు అస‌లు ఊహించ‌లేద‌ని, మంచి సినిమా చేస్తున్నామ‌నే ఆలోచ‌న‌తో చేసిన సినిమా పెళ్లి చూపులు అని, కానీ రిలీజ్ త‌ర్వాత ఆ సినిమా త‌మ జీవితాల‌ను మార్చేసింద‌ని రీతూ తెలిపింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఏదొక రోజు స‌క్సెస్ అవుతాడ‌నుకున్నా కానీ ఇంత పెద్ద స్టార్ అవుతాడ‌ని ఊహించ‌లేద‌ని చెప్తున్న రీతూ వ‌ర్మ‌, పెళ్లి చూపులు2 ను కూడా త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తేనే బావుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అన్నీ కుదిరి ఛాన్స్ వ‌స్తే విజ‌య్, తాను క‌లిసి పెళ్లి చూపులు2 చేస్తామ‌ని రీతూ తెలిపింది.

Tags:    

Similar News