మోహన్ బాబు ఇంట్లో ఇంటి దొంగ దొంగతనం

పోలీసులు ఈ విషయాలను మీడియాకు వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.

Update: 2024-09-25 05:43 GMT

సినీ నటుడు మోహన్‌ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంట్లో పని చేసే వ్యక్తి రూ.10 లక్షలను దొంగతనం చేసినట్లు ఫిర్యాదు నమోదు అయింది. రాచకొండ సీపీకి మోహన్‌ బాబు స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించారు. మోహన్‌ బాబు అర్థరాత్రి సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించిన పోలీసులు అనుమానం ఉన్న వ్యక్తులను ట్రాక్ చేయగా దొంగ తిరుపతి లో దొరికినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఈ విషయాలను మీడియాకు వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి.

మోహన్ బాబు ఇంట్లో గత కొంత కాలంగా పని మనిషిగా చేస్తున్న వ్యక్తి ఈ దొంగతనంకు పాల్పడ్డాడు. అతడు ఇటీవల ఇంట్లో రూ.10 లక్షలను దొంగతనం చేయడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు మోహన్‌ బాబు ఫిర్యాదు చేయడం జరిగిందట. అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు అందగా, ఉదయం వరకు దొంగను పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. ఏపీ పోలీసుల సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ కి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు మద్యాహ్నం లేదా సాయంత్రం వరకు దొంగ హైదరాబాద్‌ చేరుకునే అవకాశాలు ఉన్నాయట.

వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న రాచకొండ పోలీసులను అభినందిస్తున్నారు. ఈ కేసు విషయమై మోహన్‌ బాబు ఫ్యామిలీ కానీ, పోలీసులు కానీ ఇప్పటి వరకు అధికారికంగా మీడియా ముందుకు రాలేదు. త్వరలో ఏమైనా మీడియా ముందుకు దొంగను తీసుకు వస్తారేమో చూడాలి. సినిమా స్టార్స్ ఇళ్లలో దొంగతనాలు అనేవి ఈ మధ్య కాలంలో కామన్‌ అయ్యాయి. దొంగతనం చేసిన వారు మరెవ్వరో కాదు, ఇంట్లో పని చేసేవారు, ఇంట్లో ఉండే వారు దొంగలు అవుతున్నారు. అయినా కూడా జాగ్రత్తగా డబ్బులు పెట్టుకోవాలని సినిమా వారు భావించడం లేదు. ముందు ముందు ఇలాంటివి ఎన్ని జరుగుతాయో.

మోహన్‌ బాబు ప్రస్తుతం మంచు విష్ణు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో నటన కంటే ఎక్కువగా తిరుపతిలో ఉన్న స్కూల్ పై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. ఇటీవల తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇష్యూ పై మోహన్‌ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూ కల్తీకి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News