స్టార్ హీరో రోబోటిక్ ఏనుగు విరాళం..!
దేవాలయాలలో ఉండే ఏనుగులు అప్పుడప్పుడు దాడులు చేయడం, వాటి పాదాల కింద జనాలు పడి చనిపోవడం కామన్‌గా జరుగుతున్నాయి. అందుకే దేవాలయాల్లో ఏనుగులను తొలగించే కార్యక్రమం మొదలైంది.
దేవాలయాలలో ఉండే ఏనుగులు అప్పుడప్పుడు దాడులు చేయడం, వాటి పాదాల కింద జనాలు పడి చనిపోవడం కామన్‌గా జరుగుతున్నాయి. అందుకే దేవాలయాల్లో ఏనుగులను తొలగించే కార్యక్రమం మొదలైంది. ఇప్పటికి కొన్ని దేవాలయాల్లో ఏనుగులతో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ కొన్ని దేవాలయాలు మాత్రం టెక్నాలజీని వినియోగించుకుని రోబోట్ ఏనుగులను రంగంలోకి దించాయి. ఏనుగులను దేవాలయంలో ఉండటం మంచి సంప్రదాయంగా హిందువులు భావిస్తారు. అందుకే నిజమైన ఏనుగులు కాకుండా రోబోటిక్ ఏనుగులను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈమధ్య కాలంలో రోబోటిక్ ఏనుగుల గురించి ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం బాలీవుడ్‌కి చెందిన శిల్పా శెట్టి చిక్కమగళూరులోని రంభపురం మఠానికి రోబోటిక్ ఏనుగు విరాళంగా ఇచ్చారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సునీల్ శెట్టి సైతం తన మంచితనం ని చాటుకున్నారు. కర్ణాటకలోని చన్నగిరి తాలూకాలోని ధావణగేరే శిలామఠంకు రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఆదివారం మఠానికి ఆ ఏనుగు చేరుకుంది. స్థానికులు మేళ తాళాలతో ఏనుగుకు స్వాగతం పలికారు. ముంబైకి చెందిన కుపా అండ్ పెటా ఇండియా సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో కలిసి సునీల్ శెట్టి రోబోటిక్ ఏనుగు విరాళంగా అందించారు.
ఈ సంస్థలు గతంలో పలు మఠాలకు, దేవాలయాలకు రోబోటిక్ ఏనుగులను అందించింది. దేవాలయ్యాల్లో ఏనుగుల వల్ల జరుగుతున్న నష్టంను నివారించేందుకు గాను ఈ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టింది. సునీల్ శెట్టి ఈ రోబోటిక్ ఏనుగు కోసం రూ.17 లక్షల విరాళంను అందించారని తెలుస్తోంది. ముందు ముందు పలువురు బాలీవుడ్ స్టార్స్, సెలబ్రెటీలు సైతం ఇలా మఠాలకు, దేవాలయాలకు రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇచ్చే విధంగా కుపా అండ్ పెటా ఇండియా సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గుడి కార్యక్రమాల కోసం ఏనుగులను బంధించి ఉండటం కరెక్ట్ కాదని పెటా ఇండియా చాలా కాలంగా వాదిస్తూ వస్తుంది. ఇటీవల ఏనుగుల వల్ల తొక్కిసలాట జరగడం ప్రాణాలు పోవడంతో దేవాలయాల అధికారులు, ధర్మకర్తలు సైతం వాటి స్థానంలో రోబోటిక్ ఏనుగులను కోరుకుంటున్నారు. కొన్ని దేవాలయాలు సొంతంగానే రోబోటిక్ ఏనుగులకు మారుతూ ఉంటే కొన్ని దేవాలయాల్లో మాత్రం ఇలా సెలబ్రెటీలు విరాళంగా ఇచ్చిన ఏనుగులు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇదో మంచి పరిణామం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.