బిగ్ బాస్ 8 : విష్ణు గాలి తీసేసిన రోహిణి..!
ఐతే రోహిణి మీద విష్ణు ప్రియ కూడా నోరు పారేసుకుంది. నీ ఆట అసలు లేదు.. ఇది నీ క్యారెక్టర్ అంటూ అనేసింది.
బిగ్ బాస్ సీజన్ 8 లో శుక్రవారం ఎపిసోడ్ లో మెగా చీఫ్ టాస్క్ చివరి టాస్క్ నడిచింది. ఈ టాస్క్ లో తేజ, విష్ణు ప్రియ, రోహిణి, పృధ్వి, యష్మి పాల్గొన్నారు. ఈ టాస్క్ లో ఎవరు ముందు ఆటో నుంచి బయటకు వస్తే వాళ్లు టాస్క్ లో లీస్ట్ పాయింట్స్ తెచ్చుకుంటారు. ఐతే ఈ టాస్క్ లో పృధ్వి విష్ణు ప్రియ కలిసి ముందు తేజాని ఆ తర్వాత రోహిణిని ఆ నెక్స్ట్ యష్మిని ఆటో దించేశారు. పృధ్వి తో పాటుగా విష్ణు ప్రియ ఇలా చేయడంపై రోహిణి ఫైర్ అయ్యింది.
ఐతే రోహిణి మీద విష్ణు ప్రియ కూడా నోరు పారేసుకుంది. నీ ఆట అసలు లేదు.. ఇది నీ క్యారెక్టర్ అంటూ అనేసింది. అప్పుడు రోహిణి కూడా క్యారెక్టర్ గురించి మాట్లాడకు నువ్వు ముందు నిఖిల్ కి ట్రై చేసి అక్కడ వర్క్ అవుట్ అవ్వట్లేదని పృధ్వికి క్లోజ్ అయ్యావ్.. ఇది నువ్వే చెప్పావ్ అంటూ ఎటాక్ చేసింది. రోహిణి అలా అనేసరికి విష్ణు ప్రియ నోట మాట రాలేదు. విష్ణు ప్రియ తన ఆట కన్నా పృధ్వి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది అని బిగ్ బాస్ చూస్తున్న వారందరికీ తెలుసు.
బిగ్ బాస్ సీజన్ 8 లో చివరి మెగా చీఫ్ టాస్క్ లో రోహిణి గెలిచి మెగా చీఫ్ గా నిలిచింది. సీజన్ 8 లో మొదటిసారి మెగా చీఫ్ అయిన రోహిణి చివరి చీఫ్ అది కూడా పోరాడి ఆడి గెలుచుకుంది. ఐతే రోహిణి గెలిచిన తర్వాత విష్ణు ప్రియ వచ్చి రోహిణి ఆటని మెచ్చుకుంది. ఆ టైం లో రోహిణి కూడా నువ్వు అలా అనడం వల్లే నేను కసిగా ఆడానని చెప్పింది.
ఇక రోహిణి చేత టాస్క్ ఓడిపోయినందుకు పృధ్వి చాలా ఫీల్ అయ్యాడు. సీజన్ 8 లో దాదాపు జరిగిన 12 వారాల్లో పృధ్వి ఎప్పుడు అంతగా ఎమోషనల్ అవ్వలేదు. తల దించుకుని ఏడ్చేశాడు కూడా.. ఐతే చివరి వరకు ఆడిన పృధ్విని కూడా నిఖిల్, నబీల్ కన్సోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మిగతా హౌస్ మెట్స్ కూడా పృధ్విని ఓదార్చే ప్రయత్నం చేశారు.
శుక్రవారం ఎపిసోడ్ తో రోహిణి సత్తా ఏంటో ఆడియన్స్ కు అర్థమైంది. మొన్నటిదాకా టాప్ 5లో అసలేమాత్రం ఛాన్స్ లేని రోహిణిని ఇప్పుడు టాప్ 5 లో ఉండే అన్ని క్వాలిటీస్ ఆమెకు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.