సౌత్‌లో వర్కవుట్ కాకపోతే హిందీ డైరెక్టర్లకు లైఫ్ లేదా?
దీంతో ఆ ప్రభావం ఇప్పుడు హిందీ చిత్రదర్శకులపై తీవ్రంగా పడుతోంది.
ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది. దేశవ్యాప్తంగా ఏ భాషలో అయినా వర్కవుట్ అయ్యే సినిమా తీయాలి. పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ లో వర్కవుట్ చేస్తేనే డైరెక్టర్లకు విలువ పెరుగుతుంది. కేవలం ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద హిట్టయితే సరిపోదు. పాన్ ఇండియా స్థాయిలో నిరూపించాలి. అలాంటి కంటెంట్ ని కొందరు సౌత్ డైరెక్టర్లు ఇవ్వడం ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్లకు పాపులరవుతున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, కొరటాల, అట్లీ వంటి సౌత్ దర్శకులు నిరూపించారు. సౌతిండియా నార్త్ ఇండియా అనే విభేధం లేకుండా అన్నిచోట్లా విజయం సాధించే సినిమాలను అందించగలిగారు ఈ దర్శకులు.
దీంతో ఆ ప్రభావం ఇప్పుడు హిందీ చిత్రదర్శకులపై తీవ్రంగా పడుతోంది. మారిన ట్రెండ్ లో ఇప్పుడు ఏదైనా సినిమా తీస్తే కచ్ఛితంగా పాన్ ఇండియాలో వర్కవుట్ చేయాలి. సౌత్ లోను బ్లాక్ బస్టర్ అయితేనే అది 500-1000 కోట్ల వసూళ్ల దిశగా సాగుతుంది. రాజ్ కుమార్ హిరాణీ, ఆదిత్యా చోప్రా, రాకేష్ రోషన్, నితీష్ , భన్సాలీ .. ఇలా దిగ్ధర్శకుల సినిమాలేవీ సౌత్ లో రాణించడం లేదు. దీంతో అది ఒక లోటుగా మారింది. ఇకపై దీనిని మార్చాల్సి ఉందని కూడా హిందీ ఫిలింమేకర్స్ లో చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలో హిందీ దర్శకుడు రోహిత్ శెట్టి ఒక ప్రకటన చేసారు. నేను సౌత్ సినిమా చేయాలని ఆతృతగా ఉన్నాను అని ప్రకటించారు శెట్టి. సింగం ఎగైన్ డీసెంట్ హిట్‌గా రికార్డుల్లో చేరింది. బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. రోహిత్ శెట్టి బిగ్ బ్యాంగ్‌తో తిరిగి వచ్చాడు. అతడు యాక్షన్ కింగ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ చిత్రంలో చాలా మంది అగ్ర తారలు కీలక పాత్రలు పోషించారు. అయితే ఎక్కువ మైలేజ్ సంపాదించినది విలన్ పాత్ర పోషించిన అర్జున్ కపూర్. ఆ తర్వాత అక్షయ్ కుమార్ గెస్ట్ ఎంట్రీ గురించి ఎక్కువ చర్చ సాగింది. ముఖ్యంగా కాప్ స్టోరిని స్టైలిష్ యాక్షన్ ఫిలింగా ఎలివేట్ చేసిన రోహిత్ శెట్టి అందరినీ డామినేట్ చేసాడు. అందుకే ఇప్పుడు అతడు సౌత్ సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దీనర్థం.. నార్త్ సౌత్ రెండు చోట్లా వర్కవుటయ్యే సినిమా చేయడమే.. 500 కోట్ల నుంచి 1000 కోట్లు వసూలు చేసే కంటెంట్ తో అతడు తన ప్రయత్నాలను విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు. సింగం ఫ్రాంఛైజీని బంపర్ హిట్ చేసాడు కాబట్టి అతడు ఇప్పుడు ఉల్లాసంగా ఉన్నాడు. సౌత్ - నార్త్ హీరోల కలయికలో ఈసారి భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కిస్తాడేమో చూడాలి.