నైజీరియాలో రోలెక్స్ కి సన్నాహాలా?
అయితే తాజాగా అందుతోన్న సమచారం ప్రకారం రోలెక్స్ మొదలయ్యే అవకాశాలున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఎల్ సీ యూ నుంచి లోకేష్ కనగరాజ్ చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే' ఖైదీ', 'లియో' రిలీజ్ అయ్యాయి. ఇంకా 'ఖైదీ-2', 'రోలెక్స్' పాత్రతోనే ప్రత్యేకమైన ఓ సినిమాని యూనివర్శ్ లో బాగంగా ప్రకటించారు. అలాగే 'లియో' హీరో విజయ్ రెడీగా ఉంటే 'పార్తీబన్' టైటిల్ తో మరో సినిమా కూడా చేస్తానన్నారు. ఇంకా మరో ఆరేళ్ల పాటు ఎల్ సీ యూ నుంచి తుపాకీ గుళ్ల వర్షం కురుస్తుందని ముందే ఆడియన్స్ మైండ్ ని ఫిక్స్ చేసి పెట్టాడు.
ప్రస్తుతం సూపర్ రజనీకంత్ హీరోగా `కూలీ` తెరకెక్కిస్తున్నాడు లోకేష్. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో సాగే చిత్రమిది. ఎల్ సీ యూకి ఎలాంటి సంబంధం లేని చిత్రమిది. మరి ఈ సినిమా తర్వాత లోకేష్ పట్టాలెక్కించే చిత్రమేది? అంటే `ఖైదీ -2` గానీ, `రోలెక్స్` గానీ ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే తాజాగా అందుతోన్న సమచారం ప్రకారం రోలెక్స్ మొదలయ్యే అవకాశాలున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
' రోలెక్స్ 'సినిమా షూటింగ్ కి సంబంధించిన అనుమతుల కోసం నైజీరియా ప్రభుత్వంతో చిత్ర నిర్మాతలు టచ్ లో కి వెళ్తున్నారట. రోలెక్స్ కి సంబంధించి మేజర్ షెడ్యూల్స్ కొన్నింటిని నైజీరియాలో షూట్ చేయాలని లోకేష్ భావిస్తున్నాడుట. దీనిలో భాగంగా నిర్మాతలు నైజీరియా ప్రభుత్వంతో సంప్రదింపులకు వెళ్లినట్లు వినిపిస్తుంది. మరి ప్రపంచంలో ఉన్న దేశాలన్ని వదిలేసి నైజీరియానే ఎందుకు వెళ్తున్నట్లు అంటే ఆ దేశం ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు.
డ్రగ్స్, కోకైన్, హెరాయిన్, యాంఫేటమిన్, గంజాయి లాంటి మత్తు పదార్దాలకు అడ్డా ఆ ప్రాంతం. చట్ట విరుద్ద కార్యకలపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. గతంలో సూర్య హీరోగా నటించిన 'ఆయన్' ( వీడొక్కడే) సినిమా షూటింగ్ కూడా అక్కడ జరిగింది. రోలెక్స్ అంటే లోకేష్ సృష్టించిన డ్రగ్స్ సామ్రాజ్యానికి అధినేత. ఈ నేపథ్యంలో రెలెక్స్ తో రియల్ లొకేషన్లలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.